తెలుగు రాష్ట్రాలలో ఏషియన్ మల్టీప్లెక్స్ థియేటర్స్ చైన్ సిస్టమ్ ఎంత పెద్దగా ఉందో అందరికి తెలిసిందే. ప్రధాన నగరాలలో ఈ ఏషియన్ మల్టీప్లెక్స్ లు ఉంటాయి. సునీల్ నారంగ్ వీటికి అధిపతి. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ తో కలిపి మల్టీప్లెక్స్ చైన్స్ ని మరింత విస్తరించే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే గడ్చిబౌలీలో మహేష్ బాబుతో కలిపి ఏఎంబి మల్టీప్లెక్స్ స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నారు.
తెలుగు రాష్ట్రాలలో ఇక్కడే టికెట్ ధరలు అత్యధికం కావడం విశేషం. తాజాగా అల్లు అర్జున్ తో కలిసి సత్యం థియేటర్ ని ఏఏఏ సత్యం మల్టీ ప్లెక్స్ గా డెవలప్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఎంబితో సమానంగా ఈ థియేటర్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఆదిపురుష్ సినిమాతో ఈ మల్టీప్లెక్స్ స్టార్ట్ అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చైన్ బిజినెస్ లోకి మరో ఇద్దరు హీరోలు భాగస్వామ్యం అవుతున్నారు.
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి విక్టరీ వెంకటేష్, రానా మహేష్ బాబు ఏషియన్ వారితో కలిసి మల్టీప్లెక్స్ ని స్టార్ట్ చేయనున్నారంట. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఫేమస్ దేవి 70 ఎంఎం థియేటర్ ని మల్టీప్లెక్స్ గా మార్చబోతున్నారంట. ఇప్పటికే దానిని కొనుగోలు చేసినట్లు ఏషియన్ సునీల్ తెలిపారు. త్వరలో దానిని నిర్మాణం స్టార్ట్ కాబోతోందని తెలిపారు.
అధునాతన సాంకేతిక టెక్నాలజీతో దీనిని అభివృద్ధి చేయనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దానికి సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మొత్తానికి మహేష్ బాబుతో ఇప్పుడు వెంకటేష్, రానా వ్యాపార భాగస్వామ్యం అవుతూ ఉండటం నిజంగా ఆసక్తికర విషయం. ఈ థియేటర్స్ కి ఏఎంబి విక్టరీ అని పేరు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే దేవి 70ఎంఎం థియేటర్ అంటే ప్రత్యేక బ్రాండ్ ఉంది. సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా ప్రమోషన్స్ కోసం ఆ థియేటర్ కి వెళ్తూ ఉంటారు. అలాంటి థియేటర్ స్థానంలో భవిష్యత్తులో మల్టీప్లెక్స్ ని తీసుకురాబోతున్నారు. దీనిని సినీ అభిమానులు ఏ మేరకు స్వాగాతిస్తారో చూడాలి.