గాసిప్స్ : నితిన్ సినిమా నుంచి రెండో హీరోయిన్ కూడా అవుట్?

గత కొన్నాళ్ల కితం అనౌన్స్ అయ్యిన చిత్రాల్లో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అయినటువంటి నితిన్ అలాగే దర్శకుడు వెంకీ కుడుముల మరియు నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కాంబినేషన్ కూడా ఒకటి. మరి అప్పటికే వీరి నుంచి వచ్చిన మొదటి సినిమా “భీష్మ” సెన్సేషనల్ హిట్ కాగా ఈ చిత్రం అనంతరం అనౌన్స్ చేసిన రెండో సినిమా పై కూడా మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ చిత్రం విషయంలో స్టార్ట్ అయ్యినపుడు అన్ని పనులు బాగానే అయ్యాయి కానీ నెక్స్ట్ మాత్రం అనుకున్న రీతిలో అయితే ఏది జరగలేదు. ఒక్క మ్యూజిక్ వర్క్ మినహా మిగతా విషయాల్లో ఏదొక మార్పులు వస్తుంది.

మెయిన్ గా సినిమాకి పెద్ద ఎసెట్ అయిన రష్మికా మందన్నానే బయటికి వెళ్లపోయింది అనే టాక్ వైరల్ గా మారగా సరే ఈమె ప్లేస్ లో యంగ్ సెన్సేషన్ శ్రీలీల ని అయితే తీసుకున్నారు అని వచ్చిన టాక్ ఆసక్తిగా మారింది. కానీ ఇపుడు వస్తున్నా లేటెస్ట్ గాసిప్ ప్రకారం అయితే ఈ చిత్రం నుంచి శ్రీలీల కూడా బయటికి వచ్చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా రష్మిక అయితే పుష్ప 2 వల్ల దీనికి డేట్స్ సెట్ చేయలేకపోయింది అని టాక్ వచ్చింది. కానీ శ్రీలీల విషయంలో అయితే ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. మొత్తానికి అయితే నితిన్ సినిమాకి హీరోయిన్ కొరత ఇప్పుడు ఏర్పడింది. మరి ఇపుడు ఏ హీరోయిన్ ని తీసుకొస్తారో చూడాలి.