శ్రీలీల ఖాతాలో మరో ప్లాప్..!

ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న మోస్ట్ బిజీ హీరోయిన్స్ లలో అయితే టాప్ 1 గా ఉన్న యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూడా ఒకామె అని చెప్పాలి. జస్ట్ రెండు సినిమాలతో పదుల సంఖ్యలో భారీ ఆఫర్లు అందుకున్న యంగ్ బ్లాస్ట్ టాలీవుడ్ లక్కీ చార్మ్ గా కూడా పేరు తెచ్చుకుంది.

దీనితో శ్రీలీల ఓ సినిమాలో ఉంటే అది హిట్ అని సెంటిమెంట్ ఏర్పడడానికి పెద్ద సమయం కూడా పట్టలేదు. అలాగే ఇప్పుడు శ్రీలీల లక్ స్ట్రీక్ కి మధ్యలో అయితే ఇప్పుడు బ్రేకులు పడుతున్నాయి. రీసెంట్ గా నటించిన స్కంద చిత్రం అంత పెద్ద హిట్ అవ్వలేదు. దీనితో నెక్స్ట్ భగవంత్ కేసరి పై చాలా మంది డౌట్ పడగా ఇది కూడా అంత భారీ హిట్ ఏమి అవ్వలేదు.

ఇక నెక్స్ట్ ఆమె నుంచి వచ్చిన మరో సినిమానే “ఆదికేశవ” యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తో నటించిన ఈ సినిమా అయినా మంచి హిట్ అవుతుంది అనుకుంటే ఇది స్కంద ని మించి ప్లాప్ అయ్యింది. సినిమా పడిన మొదటి షో తోనే సినిమాలో మేటర్ లేదని తేలిపోయింది.

దీనితో శ్రీలీల ఉంటే ఆ సినిమా హిట్ అనేది బ్రేక్ అయ్యింది అని చెప్పాలి. ఇంకా ఫాక్ట్ మాట్లాడుకుంటే ఈ సినిమా వసూళ్లు మొదటి రోజు నుంచే దారుణంగా పడ్డాయి. ఇక నెక్స్ట్ నుంచి వచ్చే సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించగా నాగవంశీ, త్రివిక్రమ్ లు నిర్మాణం వహించారు.