రష్మిక చుట్టూ మళ్లీ బ్రేకప్ స్టోరీ స్టార్ట్ అయ్యింది!

Rashmika

రష్మిక ప్రస్తుతం తెలుగులో బాగా బిజీగా వుంది. టాప్ హీరోలందరికి ఇప్పుడు రష్మికానే ఫస్ట్ ఛాయస్ అని చెప్పాలి. ఇప్పటికే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో సరిలేరు నీకెవ్వరూ చేసి సూపర్ హిట్ కొట్టింది. బన్నీ కి జతగా పుష్ప లో కూడా రష్మిక చేస్తుంది. ఆచార్య సినిమాలో రాంచరణ్ కు జంటగా రష్మికనే హీరోయిన్ అంటే, ఇప్పుడు తనకున్న డిమాండ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Rashmika

రష్మిక తెలుగులో నటించక ముందు కన్నడ లో కొన్ని చిత్రాలు చేసింది. రష్మిక కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాలో రక్షిత్ శెట్టి అనే హీరో తో నటించింది. ఈ సినిమా కన్నడలో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రిలీజ్ అయినా వెంటనే రష్మిక రక్షిత్ శెట్టి లకు నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఆ వెంటనే రష్మిక తెలుగులో నటించిన గీత గోవిందం రష్మిక డిమాండ్ ను అమాంతం పెంచేసింది. మధ్యలో ఏమైందో ఏమోగానీ రష్మిక రక్షిత్ శెట్టి తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. కొందరేమో రష్మిక కెరీర్ కోసం నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందంటే కొందరేమో రష్మిక తెలుగు పరిశ్రమలో ఒక యువ హీరోతో ప్రేమ వల్లనే తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందనే రూమర్లు పుట్టించారు.

ఈ మధ్య రష్మిక బీచ్ లో వ్యాయామం చేస్తూ కొన్ని వీడియోలు ఇంస్టాగ్రాంలో పోస్ట్ చేసింది. తన మనస్సు బాగాలేనప్పుడు తాను ఎక్కువుగా వర్క్ అవుట్ చూస్తుంటానని గతంలో ఒక ఇంటర్వ్యూ లో రష్మిక చెప్పింది. ఈ వీడియోల్లో రష్మికను చూసినవారికి మళ్లీ ఏదన్నా బ్రేక్ అప్ అయ్యిందా లేకుంటే లాక్ డౌన్ వల్ల పెరిగిన బరువును తగ్గించుకోవడాని కష్టపడుతుందా అని సోషల్ మీడియాతో పాటు ప్రముఖ టీవీ ఛానల్లో కూడా కథలు అల్లడం మొదలుపెట్టారు.అయితే ఇదంతా కేవలం పుష్ప సినిమాలో తన పాత్ర కోసమే రష్మిక కష్టపడుతుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి.