ఓటీటీ లోకి వచ్చేస్తున్న ‘యానిమల్‌’ మూవీ..?

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌ బీర్‌ కపూర్‌, అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగ కాంబోలో వచ్చిన ‘యానిమల్‌’ మూవీ గత ఏడాది డిసెంబర్‌ 1న విడుదల అయి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది. సందీప్‌ అర్జున్‌ రెడ్డి సినిమా తో ఓవర్‌ నైట్‌ స్టార్‌ డైరెక్టర్‌ గా మారిపోయాడు.ఆతర్వాత ఇదే సినిమాను బాలీవుడ్‌ లో తెరకెక్కించి మరో సారి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు ‘యానిమల్‌’ సినిమా తో సంచలన హిట్‌ ను అందుకున్నాడు.

బాలీవుడ్‌ హీరో రణబీర్‌ కపూర్‌, రష్మిక మందన్న కలిసి నటించిన ఈ సినిమాకు తెలుగు, హిందీలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది.ఇక ఇప్పుడు ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందా అనే విషయం పై ఆసక్తి నెలకొంది. ‘యానిమల్‌’ మూవీ ఇప్పటికి కూడా కొన్ని చోట్ల స్క్రీనింగ్‌ అవుతుంది. అయితే ఈ ఓటీటీ రిలీజ్‌ పై ఇప్పటికే చాలా రూమర్స్‌ వచ్చాయి.

జనవరి 26న స్ట్రీమింగ్‌ అవుతుందంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది . అయితే ఇప్పుడు అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీ లోకి వస్తుందని తెలుస్తోంది. యానిమల్‌ ఓటీటీ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ భారీ రేటుకు దక్కించుకుంది.

ఇక యానిమల్‌ సినిమాను జనవరి 15న సంక్రాంతి సందర్భంగా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేయనున్నారని సమాచారం. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తుంది.. ‘యానిమల్‌’ సినిమా లో బాబీడియోల్‌ విలన్‌ గా నటించాడు.

అలాగే అనిల్‌ కపూర్‌ కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌ గా నటించిన తృప్తి డిమ్రి బాగా పాపులర్‌ అయింది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తం గా భారీ కలెక్షన్స్‌ వసూల్‌ చేసింది. మరి ఓటీటీ లో ఎలాంటి రికార్డ్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.