‘యానిమల్‌’ కలెక్షన్ల సునామీ!?

రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన ‘యానిమల్‌’ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదలైన సంగతీ తెలిసిందే.. ఈ సినిమా నిడివి, వయొలెన్స్‌ ఎక్కువ ఉండడంతో ఓ వర్గం ప్రేక్షకుల నుంచి కాస్త మిశ్రమ స్పందన వచ్చినా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్‌ దగ్గర దుమ్ముదులిపేస్తోంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌తోనే సత్తా చూపిన ఈ చిత్రం ఫస్ట్‌ డే కలెక్షన్లలోనూ సత్తా చాటింది.

ఢిల్లీలో 1318 షోలు పడగా 79 శాతం ఆక్యుపెన్సీతో నడిచింది. ఢిల్లీలో 1040 షోలు, హైదరాబాద్‌లో 316 షోలు 82 శాతం ఆక్యుపెన్సీ, తమిళంలో 88 షోలు 30 శాతం ఆక్యుపెన్సీతో తొలిరోజు ముగిసింది. దేశవ్యాప్తంగా హిందీలో 54.78 కోట్లు, దక్షిణాదిలో రూ.9.05 కోట్లు వసూళ్లు రాబట్టగా మొత్తంగా చూస్తే తొలి రోజు ఈ చిత్రం 63.80 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు బాలీవుడ్‌ ఎనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.

‘సెలవు రోజులు కాదు, ఫ్రాంఛైజ్‌ సినిమా కాదు, భారీ కామియో ఆర్టిస్ట్‌లు లేరు, అడల్డ్‌ సర్టిఫికెట్‌ చిత్రం, మూడు గంటలకుపైగా నిడివి, మరో సినిమాతో పోటీ అయినా మొదట రోజు కలెక్షన్లు అదరగొట్టింది. రణ్‌బీర్‌కి భారీ ఓపెనింగ్స్‌ చిత్రమిది’ అని తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ఏడాది విడుదలైన భారీ చిత్రాల్లో ఫస్ట్‌ డే కలెక్షన్ల పరంగా టాప్‌ 5 చిత్రాలు తీసుకుంటే షారుక్‌ఖాన్‌ జవాన్‌ 65.50 కోట్లు, పఠాన్‌ రూ.57 కోట్లు, యానిమల్‌ 54.75 కోట్లు, కేజీఎఫ్‌ 53.95 కోట్లు, వార్‌ 51.30 కోట్లు వసూళ్లు రాబట్టాయి. తాజాగా విడుదల ‘యానిమల్‌’ చిత్రం మూడో స్థానంలో ఉంది.