బాక్సాఫీస్ : 13 రోజులైనా ఆగని “ఆనిమల్” 

బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చి సెన్సేషనల్ వసూళ్లు కొల్లగొడుతున్న లేటెస్ట్ చిత్రాల్లో “ఆనిమల్” కూడా ఒకటి. మరి దర్శకుడు సందీప్ రెడీ వంగ అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ ల కాంబినేషన్ లో తెరకెక్కించిన మొదటి సినిమా ఇది కాగా వీరి నుంచి వచ్చిన మొదటి సినిమానే బాలీవుడ్ మార్కెట్ లో ఒక రీసౌండింగ్ హిట్ గా నిలిచింది.

అయితే ఇప్పటివరకు 13 రోజుల బాక్సాఫీస్ రన్ ని వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం కంప్లీట్ చేసుకోగా ఈ 13 రోజులు అయినా కూడా ఆనిమల్ స్పీడ్ మాత్రం మాములుగా లేదని చెప్పి తీరాలి. కాగా ఈ చిత్రం మొత్తం 772.33 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

దీనితో ఆనిమల్ సినిమా ఈ వీకెండ్ కి ఈజీగా 800 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ గా నటించగా రష్మికా మందన్నా అలాగే త్రిప్తి దిమిరిలు హీరోయిన్స్ గా నటించారు. అలాగే ఈ సినిమాతో చాలా మంది నటులకి అయితే లైఫ్ కూడా సెట్ అయ్యిపోయింది అని చెప్పొచ్చు.

ఇంకా ఈ చిత్రానికి అనేకమంది బాలీవుడ్ సహా తెలుగు మ్యూజిక్ దర్శకులు వర్క్ చేయగా టి సిరీస్ మరియు సందీప్ రెడ్డి వంగ అన్నయ్య నిర్మాణం వహించారు. దీనితో సందీప్ రెడ్డి వంగ ఫ్యామిలీ కూడా లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోయారని సినీ వర్గాలు చెప్తున్నాయి.