‘యానిమల్’ తెలుగులో ఆ ‘బజ్’ రావట్లేదెందుకో.!

అనిల్ కపూర్, రణ్‌బీర్ కపూర్, రష్మిక మండన్న నటించిన ‘యానిమల్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ‘అర్జున్ రెడ్డి’ ఫేం సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకుడు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

ట్రైలర్ ఆకట్టుకుంది. పాటలూ బావున్నాయ్.! కానీ, తెలుగులో ఎందుకో ‘యానిమల్’ మీద ఆర్గానిక్ బజ్ కనిపించడంలేదు. అదే సమయంలో పెయిడ్ బజ్ మాత్రం గట్టిగానే కనిపిస్తోంది. అదంతా సందీప్ రెడ్డి వంగా మార్కెటింగ్ స్కిల్ అనుకోవాలా.? అంతేనేమో.!

వాస్తవానికి, తెలుగులో ఈ సినిమాకి ప్రమోషన్లు ఒకింత జాగ్రత్తగా చేసి వుంటే, బజ్ వేరేలా వుండేది. అయితే, హిందీ సినిమా కదా.? ప్రమోషన్లు బాలీవుడ్‌లో ఎక్కువగా చేసుకోవాల్సి వుంటుంది. తగినంత టైమ్ వున్నా, ప్రమోషన్లలో జోరు పెద్దగా కనిపించడంలేదు.

రష్మికతో సౌత్ అంతా ప్రమోషన్లు చేయించి వుంటే, బజ్ వేరే లెవల్‌లో క్రియేట్ అయ్యేదే. ఎక్కడో పీఆర్ లోపం వుందనీ, అందుకే పరిస్థితి ఇలా వుందనీ సినీ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఖర్చు పరంగా రాజీ పడకపోయినా (పబ్లిసిటీ) విషయంలో, ప్రమోషన్లు తేలిపోవడమే అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

సినిమా రిలీజ్ అయ్యాక, ఈ డిస్కషన్స్‌కి పెద్దగా ఛాన్స్ వుండదనీ, సినిమానే మాట్లాడుతుందనీ, ‘యానిమల్’ టీమ్ భావిస్తోందిట.!