యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వర్షిణి చేసే సందడి, ఆమె షేర్ చేసే క్యూట్ ఫోటోలకు, వెరైటీ ఫోటో షూట్లకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. బుల్లితెరపై వర్షిణి ఎంత యాక్టివ్‌గా ఉంటూ సెటైర్లు వేస్తుందో సోషల్ మీడియాలోనూ అంతే ఫన్నీగా ఉంటుంది. ఇక వర్షిణి అంటే ఆది గురించి చెప్పుకోవాల్సిందే. బుల్లితెరపై ఈ జంట చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవ్వడంతో యూట్యూబ్‌లో క్రేజీ జంటగా మారిపోయారు.
అయితే తామిద్దరం మాత్రం మంచి స్నేహితులమేనని చెబుతూ వస్తుంటారు. ఈ మధ్యే ఓ టాక్ షోలో పాల్గొని ఇద్దరి మధ్య ఉన్న బంధంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. అయితే వర్షిణి ఏనాడూ కూడా తన ఫ్యామిలీ గురించి బయటకు చెప్పలేదు. కానీ ఈ మధ్యే అన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది. చిన్నతనంలోనే అమ్మ నాన్న విడిపోయారని, తామంతా అమ్మ దగ్గరే పెరిగిమాని చెప్పింది. తనకు ఓ అక్క, ఓ అన్న ఉన్నాడని పేర్కొంది. అయితే ఈ మధ్యే అక్క బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది.
బయటకు వెకేషన్‌కు వెళ్లి ఫ్యామిలీ అంతా సరదాగా గడిపారు. అయితే వర్షిణి తన తల్లి పుట్టిన రోజును మాత్రం ఇంట్లోనే గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. ఇంటి చుట్టుపక్కల వారిని, తన మదర్ ఫ్రెండ్స్‌ను పిలిచినట్టు కనిపిస్తోంది. ఈ వేడుకల్లో అందరూ హడావిడిగా కనిపిస్తున్నారు. ఇక వర్షిణి, ఆమె సోదరి ఇద్దరూ కూడా తల్లిని ముద్దుల్లో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.