యాంకర్ సుమ సోషల్ మీడియాలో ఈ మధ్య ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాను తన కామెడీ టైమింగ్‌తో ఊపేస్తోంది. బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ తన అభిమానులను అలరిస్తోంది. అయితే సుమ వైవాహిక జీవితంపై ఎప్పుడూ రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఈ మధ్య వాటికి తమదైన శైలిలో చెక్ పెట్టేస్తున్నారు. ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగుతున్నారు. పండులకు కలిసి విషెస్ చెబుతున్నారు.
తమ మధ్య గొడవలేమీ లేవు అంతా కలిసే ఉన్నామని పరోక్షంగా చెబుతున్నారు. ఇలా ఎన్ని సాక్ష్యాలు చూపించినా వచ్చే రూమర్లు మాత్రం ఆగడం లేదు. ఇద్దరికీ గొడవలు అయ్యాయి.. అందుకే వేర్వేరు ఇంట్లో ఉంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యే కలిశారని, కొడుకును హీరోగా లాంచ్ చేసేందుకు ఇద్దరూ కలిసి ముందడుగు వేశారని తెలుస్తోంది. తాజాగా సుమ తన భర్త రాజీవ్ కనకాలపై ఉన్న ప్రేమను చాటుకుంది.
నేడు (నవంబర్ 13) రాజీవ్ కనకాల బర్త్ డే. ఈ సందర్భంగా ఓ క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ భర్తపై ప్రేమను కురిపించింది. మై డియరెస్ట్ రాజా అంటూ హ్యాపీ బర్త్ డే చెప్పింది. నువ్వే నా బలం.. నువ్వే నా సంతోషం.. నీతో ఉండటం నాకో వరం.. నీతో ఉన్న ప్రతీ రోజూ ఏదో కొత్తగా అనిపిస్తుంది.. లవ్యూ.. నేను నీలోనే ఉంటాను.. మై డియర్ అంటూ రాజీవ్‌పై అంతులేని ప్రేమను కురిపించింది.