అలా భయపెట్టారు.. దెబ్బకు సుమను పారిపోయేలా చేశారు కదరా.. !!

కామెడీ ఎంటర్టైన్మెంట్ షోలో ఒక్కోసారి రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌ను ప్లే చేస్తూ ఆర్టిస్ట్‌లు స్కిట్స్ వేస్తుంటారు. రోజా, అనసూయ, రష్మీలా జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు గెటప్‌లు వేసి స్కిట్స్ చేస్తుంటారు. అలా ఒక్కో సారి ఆ గెటప్‌లు చూసి వారే షాక్ అవుతుంటారు. తాజాగా బొమ్మ అదిరింది అనే కొత్త షో ప్రారంభం కానుంది. నేటి రాత్రి ఈ షో గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది. అయితే ఇదేమీ కొత్త షో కాదు. అదిరింది షోకు సెకండ్ వర్షన్. అదిరింది షోకే కొన్ని రిపేర్లు చేసి తీసుకొస్తున్నారు.

Anchor Suma Fun in Bomma Adirindhi
Anchor Suma Fun in Bomma Adirindhi

అదిరింది షోలో యాంకర్లుగా భాను శ్రీ, రవి ఉండేవారు.. ఈసారి శ్రీముఖిని తీసుకొచ్చారు. జడ్జ్‌గా నవదీప్‌ను పీక్.. జానీ మాస్టర్‌ను పెట్టినట్టు తెలుస్తోంది. మొదటి రోజు కాబట్టి అలీ, సుమ, అనసూయ వంటి వారిని పట్టుకొచ్చారు. ఇందులో మాత్రం సుమను బెదరగొట్టారు. సుమ క్యారెక్టర్‌ను సోషించిన వ్యక్తిని చూసి దెబ్బకు షాక్ అయింది. గల్లీబాయ్స్ టీంలో ఓ పొట్టి వ్యక్తి సుమ గెటప్ వేయడంతో సుమ ఆశ్చర్యం పోయింది.

ఇక అదే భరించలేకుండా ఉన్న సుమకు రాజీవ్ కనకాల పాత్రను పోషించే వ్యక్తిని చూసి సుమ షోలోంచి వెళ్లిపోతానని లేచింది. రాజీవ్ ఏంటి ఇలా ఉన్నాడు.. నేను ఉండను.. వెళ్లిపోతానని సుమ రావడంతో అందరూ పగలబడి నవ్వేశారు. మరి ఆ ఇద్దరూ స్కిట్‌లో ఏం చేశారు.. ఆ తరువాత ఏమవుతుందో మరి. నేటి రాత్రి 9 గంటలకు ఈ షోను గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు.