ఆనంద్‌ దేవరకొండ చిత్రం ‘గం గం గణెళిశా..’

దొరసాని సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌, పుష్పకవిమానం సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్‌ దేవరకొండ. ఇక ఈ ఏడాది బేబి సినిమాతో సూపర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

ఈ యంగ్‌ హీరో నటిస్తోన్న కొత్త చిత్రం ’గం..గం..గణెళిశా’ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హై`లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్‌ శెట్టి ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను డిజిటల్‌గా సమంతా లాంఛ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఫస్ట్‌ లుక్‌ లాంఛ్‌ ఈవెంట్‌కు సంబంధించి మేకర్స్‌ మరో అప్‌డేట్‌ ఇచ్చారు. కొంపల్లిలోని రాయచందాని మాల్‌ లో ఈ ఫస్ట్‌ లుక్‌ లాంఛ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు మేకర్స్‌ సోషల్‌ విూడియాలో తెలిపారు.

దీనితో పాటు ఆనంద్‌ దేవరకొండ మాట్లాడిన ఒక వీడియోను వదిలారు. ఈ వీడియోలో ఆనంద్‌ మాట్లాడుతూ.. ఈ ఇయర్‌ బేబితో నాకు భారీ బ్లాక్‌ బస్టర్‌ను అందించారు. నా తదుపరి చిత్రం గం..గం..గణెళిశా. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ లాంఛ్‌ ఈవెంట్‌ కొంపల్లిలోని రాయచందాని మాల్‌లో జరుగుతుంది. నాతో పాటు విూరు వచ్చి ఈ ఈవెంట్‌ను సక్సెస్‌ చేయండంటూ చిన్న దేవరకొండ తెలిపాడు.