Bigg boss 4: అమ్మ రాజశేఖరా? దివిని పడేశావుగా.. బిగ్ బాస్ 4 లో అప్పుడే ప్రేమజంట?

Amma rajashekar cooking with divi in bigg boss house

హమ్మయ్య.. బిగ్ బాస్ లో గొడవలే జరుగుతున్నాయి.. తొలిప్రేమలు లాంటివి ఎప్పుడు చిగురించుకుంటాయో అని అంతా ఎదురు చూస్తున్నట్టుగానే బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ చిగురించింది. సీజన్ స్టార్ట్ అయిన నాలుగు రోజులకే బిగ్ బాస్ హౌస్ లో ఓ ప్రేమజంట బయటికి వచ్చింది.

Amma rajashekar cooking with divi in bigg boss house
Amma rajashekar cooking with divi in bigg boss house

నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఇంకా ప్రేమాదోమా స్టార్ట్ కాకపోవడంతో… ప్రేక్షకులు కొంచెం బోర్ ఫీల్ అయ్యారు. దివి అనే కంటెస్టెంట్.. మూడు రోజులు హౌస్ లో ఉండి కూడా అస్సలు ఎవ్వరినీ పట్టించుకోకపోవడంతో… అసలు ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్ కు ఎందుకొచ్చింది. అసలు ఈ అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. చూడటానికి బాగానే ఉంది. తెలుగు కూడా బాగానే వచ్చు. తెలుగు రాని మొనల్ అయితే ఎప్పుడూ లొడలొడా వాగుతూనే ఉంటుంది. మరి.. ఈమెకేమైంది.. అని బిగ్ బాస్ అభిమానులు ఇలా అనుకున్నారో లేదో.. దివి స్టార్ట్ చేసేసింది. ఎవరు ఎలా ఉన్నారో.. ఎవరు తమ పద్ధతిని మార్చుకోవాలో ముఖం మీదనే చెప్పేసి అటు ప్రేక్షకుల మనసునే కాదు.. మిగితా కంటెస్టెంట్ల మనసును కూడా దోచేసుకున్నది.

Amma rajashekar cooking with divi in bigg boss house
Amma rajashekar cooking with divi in bigg boss house

ఇక.. అందదూ దివిని ప్రత్యేకంగా చూడటం మొదలు పెట్టారు. సూర్య కిరణ్ కూడా దివిని మెచ్చుకున్నాడు. అమ్మ రాజశేఖర్ అయితే దివి మాట్లాడిన తీరు.. హౌస్ లో ఉంటున్న తీరు చూసి ముచ్చటపడిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పడిపోయాడు.

అంతేనా.. అందంగా ఉంటుంది.. క్యారెక్టర్ మంచిది.. అంటూ దివిని పొగడ్తల్లో ముంచెత్తుతున్నాడు. అంతేకాదు.. తను వంట చేస్తూ తనకు సాయం చేయమని కోరగానే దివి కూడా అమ్మరాజశేఖర్ కు తోడుగా ఉండి వంట చేసింది. అప్పుడే మన మనసులో మాటను విప్పేశాడు అమ్మ రాజశేఖర్. ఇక్కడ నువ్వే హీరోయిన్.. నేనే హీరో.. అని అనగానే సిగ్గుపడుతూ దివి అక్కడి నుంచి వెళ్లిపోవడం.. నాకు నిజంగా వంట చేసే అబ్బాయిలంటే చాలా ఇష్టం అంటూ దివి.. అమ్మ రాజశేఖర్ తో అనడం.. ఇవన్నీ చూస్తుంటే బిగ్ బాస్ హౌస్ లో ఓ ప్రేమజంట తయారైనట్టే అని అందరూ అనుకుంటున్నారు.

Amma rajashekar cooking with divi in bigg boss house
Amma rajashekar cooking with divi in bigg boss house

అంతేనా… మిగితా కంటెస్టెంట్లు కూడా వీళ్ల ప్రేమను చూసి మురిసిపోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను మాటీవీ తాజాగా విడుదల చేసింది. ప్రోమోలో అయితే అలా ఉంది. మరి.. నిజంగా వీళ్లమధ్య ప్రేమ చిగురించిందా? లేదా? అని తెలుసుకోవాలంటే మాత్రం ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేదాకా ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేసేయండి..

Ammai influence tho #AmmaRajasekhar cooking fasak!!! #BiggBossTelugu4 Today at 9:30 PM on #StarMaa