అమ్మ రాజశేఖర్ బిగ్ బాస్ షో వల్ల బాగానే ఫేమస్ అయ్యాడు. అంతకు ముందు సక్సెస్ ఫుల్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్‌గా అమ్మ రాజశేఖర్ అందరికీ తెలుసు. కానీ బిగ్ బాస్ షో వల్ల మరింత దగ్గరయ్యాడు. అయితే అమ్మ రాజశేఖర్‌కు ఎంత పాజిటివిటీ వచ్చిందో అంతే స్థాయిలో నెగెటివిటీ వచ్చింది. ఊరికే చిరాకు పడటం, ఎదుటి వారి వాదనను వినిపించుకోకుండా ఉండటం, ఇష్టమొచ్చినట్టుగా ఎదుటివారిని కించపర్చడం వంటివి చేయడంతో అమ్మ రాజశేఖర్‌కు కాస్త బ్యాడ్ ఇమేజ్ వచ్చింది.
అయితే తాజాగా అమ్మ రాజశేఖర్ తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్నాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రొఫెషనల్ కెరీర్ గురించి మాట్లాడాడు. డ్యాన్సర్, గ్రూప్ డ్యాన్సర్, కొరియోగ్రఫర్, డైరెక్టర్ ఇలా అంచెలంచెలు ఎదిగే క్రమంలో వచ్చిన ఎన్నో కష్టాల గురించి చెప్పాడు. మొదటగా కొరియోగ్రఫర్‌గా పీక్స్‌లో ఉన్న సమయంలోనే డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాడట.
ఇదే విషయాన్ని అందరికీ చెబితే.. ఎందుకు ఆ పిచ్చి ఆలోచన.. మంచిగా ఓ సాంగ్‌కు ఐదు లక్షలు తీసుకుంటున్నావ్.. హ్యాపీగా ఇదే పని చేసుకోవచ్చు కదా అని సలహాలు ఇచ్చారట. కానీ తాను అనుకున్నది చేశాను.. డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యాను అని అమ్మ రాజశేఖర్ చెప్పాడు. అలా చెబుతూనే ఒక్కో పాటకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో బయటకు చెప్పేశాడు.