జ్ఞానవేల్‌తో రజనీ తదుపరి చిత్రం.. ప్రత్యేక రోల్‌లో అమితాబ్‌ !

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ప్రస్తుతం 170వ సినిమా జ్ఞానవెల్‌ డైరెక్షన్‌ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కూడా నటిస్తున్నారు. రజిని అమితాబ్‌ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో సస్పెండ్‌ అయిన పోలీస్‌ ఆఫీసర్‌ గా రజిని కనిపిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ సూపర్‌ స్టార్‌ బర్త్‌ డే కానుకగా డిసెంబర్‌ 12న రిలీజ్‌ చేస్తారని తెలుస్తుంది.

ఈ సినిమా తర్వాత రజిని 171వ సినిమా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఉంటుందని తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసిన ఈ సినిమా త్వరలో అనౌన్స్‌ మెంట్‌ రాబోతుందని తెలుస్తుంది. సూపర్‌ స్టార్‌ బర్త్‌ డే రోజే ఈ సినిమా ముహూర్తం పెడతారని టాక్‌. రజినితో కూడా లోకేష్‌ ఒక గ్యాంగ్‌ స్టర్‌ కథతో వస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ లోకేష్‌ కనకరాజ్‌ సినిమాలకు ఆడియన్స్‌ లో ఒక క్రేజ్‌ ఉంది.

ఖైదీ, మాస్టర్‌, విక్రం, లియో ఇలా వరుస సినిమాలతో ఆడియన్స్‌ ని అలరిస్తున్న లోకేష్‌ రజిని సినిమాతో మరోసారి రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నాడు. లోకేష్‌ కనకరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ లో భాగంగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. లోకేష్‌ కనకరాజ్‌ రజిని కాంబో సినిమాతో 1000 కోట్ల మార్క్‌ రీచ్‌ అవ్వాలని చూస్తున్నారు. రజిని 170వ సినిమా పూర్తి కాగానే 171వ సినిమా సెట్స్‌ విూదకు వెళ్తుందని తెలుస్తుంది. సినిమాలో రజిని లుక్‌, క్యారెక్టరైజేషన్‌ నెక్ట్స్‌ లెవెల్‌ లో ఉంటాయని అంటున్నారు.

రజిని బర్త్‌ డే కానుకగా 170వ సినిమా టీజర్‌ తో పాటుగా లోకేష్‌ సినిమా అనౌన్స్‌ మెంట్‌ కూడా సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ని సర్‌ ప్రైజ్‌ చేస్తుందని చెప్పొచ్చు. రీసెంట్‌ గా జైలర్‌ తో తిరిగి సూపర్‌ ఫాంలోకి వచ్చిన రజిని రాబోయే సినిమాలతో పెద్ద టార్గెట్‌ నే పెట్టుకున్నాడని తెలుస్తుంది. కొన్నాళ్లుగా రజిని సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర సరైన ఫలితాలు అందించడంలేదు. జైలర్‌ సినిమాతో సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఆకలి తీర్చేసింది. రాబోతున్న రెండు సినిమాలు కూడా జైలర్‌ హిట్‌ మేనియా కొనసాగిస్తాయని ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు.