యశోద డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్.. ఎన్ని కోట్లంటే?

సమంత మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా నటించిన సినిమా యశోద. హరి హరీష్ ద్వయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇకపోతే ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంఖ కృష్ణ ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా.. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని సమాచారం. యశోద సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్త అమెజాన్ ప్రైమ్ కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. యశోద సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ఏకంగా 45 కోట్ల రూపాయలకు కైవసం చేసుకున్నట్టు సమాచారం.

ఇక ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకోవడంతో అమెజాన్ సైతం భారీ ధరలకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు. ఇక థియేటర్లో 8 వారాలుపూర్తి చేసుకున్న అనంతరం యశోద సినిమాని అమెజాన్లో ప్రసారం చేయనున్నట్టు సమాచారం. వీలైనంతవరకు డిసెంబర్ నెలాకరిలోన లేకపోతే వచ్చే ఏడాది మొదటి వారంలో ఈ సినిమాని అమెజాన్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.