‘పుష్ప ది రూల్‌’.. ఆడియో రైట్స్‌ 60కోట్లు!

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ డైరెక్షన్‌లో నటిస్తున్న మోస్ట్‌ ఎవెయిటెడ్‌ సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ ‘పుష్ప.. ది రూల్‌’ చిత్రంలో బన్నీ పుష్పరాజ్‌గా మరోసారి రెట్టింపు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడని ఇప్పటివరకు షేర్‌ చేసిన పోస్టర్లు, వీడియోలు చెప్పకనే చెబుతున్నాయి. ఇటీవలే రాక్‌స్టార్‌ డీఎస్పీ అండ్‌ టీం మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో బిజీగా ఉన్న స్టిల్‌ ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘పుష్ప ది రూల్‌’ ఆడియో హక్కులను అన్ని భాషల్లో పాపులర్‌ కంపెనీ టీ సిరీస్‌ దక్కించుకున్నట్టు తెలిసిందే.

తాజాగా ఎంత మొత్తానికి రైట్స్‌ దక్కించుకున్నారనే అప్‌డేట్‌ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భూషణ్‌ కుమార్‌ ఆడియో రైట్స్‌ కోసం ఏకంగా రూ.60 కోట్లు పెట్టాడని బీటౌన్‌ సర్కిల్‌ టాక్‌. ఇదే నిజమైతే ఇప్పటివరకు అల్లు అర్జున్‌ కెరీర్‌లో ఏ సినిమా అందుకోని అరుదైన ఫీట్‌ ‘పుష్ప ది రూల్‌’ ఖాతాలో చేరిపోయినట్టే. ఇక ‘పుష్ప ది రూల్‌’ మ్యూజిక్‌పై మూవీ లవర్స్‌లో ఏ స్థాయిలో క్రేజ్‌ ఉందో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు. రాక్‌స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ పుష్ప ప్రాంఛైజీకి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ అందిస్తున్నాడని తెలిసిందే. మరి ఫస్ట్‌ పార్టుతో అదిరిపోయే ఆల్బమ్‌ అందించిన డీఎస్పీ మరి సీక్వెల్‌కు ఎలాంటి సాంగ్స్‌ రెడీ చేశాడని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మైత్రీ మూవీ మేకర్స్‌ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప ది రూల్‌’ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోండగా.. ఫహద్‌ ఫాసిల్‌, జగదీష్‌ ప్రతాప్‌ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.