త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ.. మరింత పెరిగిన డైరెక్టర్ బాధ్యత!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకని ప్రస్తుతం ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. 2012లో వచ్చిన జులాయి, 2015 లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, 2020లో వచ్చిన అల వైకుంఠపురం సినిమాలు అన్నీ ఇండస్ట్రీ హిట్స్ కావటం గమనార్హం.

ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ బాధ్యత మరింత పెరిగిందని చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు బన్నీ క్రేజ్ మామూలుగా లేదు ఇంతకుముందు బన్నీ తో త్రివిక్రమ్ తీసిన సినిమాలు టాలీవుడ్ ప్రజలని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమాలు.

ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో బన్నీ అభిమానులని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయాలి. ఎందుకంటే, పుష్ప 2 సినిమా నేషనల్ వైడ్ గా బన్నీకి అంత క్రేజ్ తీసుకొచ్చింది. ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే బన్నీ నెక్స్ట్ మూవీ అన్ని భాషల్లో భారీ లెవెల్లో విడుదల చేయాల్సి ఉంటుంది. అప్పుడు త్రివిక్రమ్ కథ కథనాల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా గుంటూరు కారం సినిమా ఆశించినంత స్థాయిలో ఆడకపోగా త్రివిక్రమ్ టేకింగ్ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.

కలెక్షన్స్ పరంగా సినిమా బాగున్నప్పటికీ సినిమా ఆడియన్స్ కి అంతగా ఎక్కలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ నెగటివ్ థాట్స్ నుంచి బయట పడాలంటే బన్నీ కాంబినేషన్లో వచ్చిన మూవీ కచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి. ఈ సినిమా గురించి నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ ఇప్పటివరకు రాజమౌళి కూడా టచ్ చేయలేని జోనర్ లో ఈ మూవీ ఉంటుంది, మంచి విజువల్స్ ఉంటాయి అని చెప్పారు. అదే నిజమైతే గనక సినిమా యూనివర్సల్ హిట్ సాధించడంతోపాటు త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి సక్సెస్ అందుకుంటాడు.