బింబిసారుడిపై అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదలైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. బింబిసారా ఒక ఫాంటసీ టైమ్ ట్రావెల్ సినిమా. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సెలబ్రిటీలను కూడా బాగా ఆకట్టుకుంది. పలువురు స్టార్ సెలబ్రెటీలు కూడా ఈ సినిమా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా బింబిసారా సినిమా గురించి స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

కళ్యాణ్ రామ్ కి పటాస్ సినిమా తర్వాత చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఒకటి కూడా లేదు. వశిష్ట దర్శకత్వం వహించిన బింబి సార సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో బింబిసారుడి పాత్రలో కళ్యాణ్ రామ్ నటన అద్భుతంగా ఉంది. తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేస్తూ ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించాడు. ” బింబిసారా హోల్ టీం కి నా అభినందనలు. ఎంతో ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన ఫాంటసీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ నటన అద్భుతంగా ఉంది. నందమూరి కల్యాణ్ ఎప్పుడూ కొత్త టాలెంట్‌ని ఇండస్ట్రీలోకి తీసుకువస్తూ, కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంటాడు. దీంతో ఆయనంటే నాకు చాలా గౌరవం ఏర్పడింది.

అలాగే ఈ సినిమా మేకింగ్ విషయంలో డెబ్యూ డైరెక్టర్‌ వశిష్ఠ తన మార్క్ ను చూపించారు. అంతే కాకుండా ఈ సినిమాలో టెక్నీషియన్స్, ఆర్టిస్టులందరూ చక్కగా నటించడం అభినందనీయం. ఇక ఈ సినిమాకి సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాని అన్ని వయస్సుల వారుచూసే విధంగా తెరకెక్కించడం సంతోషకరంగా అంటూ” ట్వీట్ చేశాడు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్ లో పాల్గొనటానికి సిద్దంగా ఉన్నాడు. తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ పట్టలెక్కనుంది.