అల్లు అర్జున్ ది ఆ ప్రాజెక్ట్ పక్కకి పోయినట్టేనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు తన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “పుష్ప” తో పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే నిజానికి బన్నీ కెరీర్ లో ఇది మొదటి పాన్ ఇండియన్ సినిమా కాదు అని అందరికీ తెలిసిందే. కానీ ఇది మొదట రేస్ లోకి రావాల్సి వచ్చింది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా అనౌన్స్ చేసిన కొన్నాళ్లకే బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో బన్నీ మరో పాన్ ఇండియన్ సినిమా అనౌన్స్ చెయ్యడం ఆ టైం లో మరింత హైప్ తీసుకొచ్చింది.

కానీ ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ పక్కకి వెళ్లడం తారక్ తో కొరటాల 30వ సినిమాని అనౌన్స్ చెయ్యడం జరిగింది. దీనితో అప్పటికి బన్నీ కొరటాల కాంబోలో సినిమా ఆగిపోయింది. కానీ అసలు విషయానికి వస్తే ఈ కాంబోలో కొన్నాళ్ల వరకు అయితే ఈ సినిమా ఊసే ఉండకపోవచ్చట..

ఎందుకంటే ఆల్రెడీ బన్నీ పుష్ప రెండు సినిమాలు తర్వాత ఐకాన్, ఆ తర్వాత స్టార్ దర్శకుడు మురుగదాస్ తో ఓ బారె సినిమా చేయడం ఫిక్స్ అయ్యింది. సో ఎలా లేదన్నా ఇంకో మూడు నాలుగేళ్లు కొరటాలతో సినిమా పడదు. సో ఆల్ మోస్ట్ ఈ సినిమా ఇక పక్కకి వెళ్ళిపోయినట్టే అని చెప్పాలి.