అలా చేయడంతో ఫిదా.. ఉపాసనపై బన్నీ ప్రశంసలు

Allu Arjun Praise Upasna For Handicraft Christamas tree

ఉపాసన రామ్ చరణ్‌లు క్రిస్మస్ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మెగా కజిన్స్ అందరినీ ఒకే చోటకు తీసుకొచ్చి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఏర్పాట్లను రామ్ చరణ్ ఉపాసన దగ్గరుండి చూసుకున్నారు. నిన్న రాత్రి క్రిస్మస్ వేడుకల్లో మెగా హీరోలందరూ రచ్చ రచ్చ చేశారు. సీక్రెట్ శాంటాలా మారి గిఫ్ట్‌లు ఇచ్చుకున్నారు. మెగా హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సరికి అభిమానుల ఆనందాలకు అవధుల్లేకుండాపోయాయ్.

అయితే క్రిస్మస్ వేడుకలంటే అందులో క్రిస్మస్ ట్రీ ఉండాల్సిందే.అయితే వీటిని ఒక్కొక్కరు ఒక్కోలా రెడీ చేస్తారు. ప్లాస్టిక్‌తో క్రిస్మస్ ట్రీని తయారుచేస్తుంటారు. కొందరు ఎక్కువ ఎత్తు ఉండేలా క్రిస్మస్ ట్రీను పేర్చుతారు. అయితే ఉపాసన మాత్రం కాస్త కొత్తగా ఆలోచించింది. క్రిస్మస్ ట్రీలోనూ క్రియేటివిటీని చూపించింది. అందులోనూ మన సంప్రదాయన్ని, ఆచారాలను ప్రతిబింబించేలా చేసింది. దీంతో ఆ ట్రీని చూసి బన్నీ ఫిదా అయ్యాడు.

Allu Arjun Praise Upasna For Handicraft Christamas tree
Allu Arjun Praise Upasna For Handicraft Christamas tree

క్రిస్మస్ ట్రీని చేనేత దుస్తులు, చేతి వృత్తుల వారి ప్రతిభ కనిపించేలా డిజైన్ చేయించింది. దీంతో ఆ క్రిస్మస్ ట్రీ అందరినీ ఆకట్టుకుంది. దీనిపై బన్నీ రియాక్ట్ అవుతూ ఉపాసనను పొగిడేశాడు. ఎంతో కొత్తగా ఆలోచించావ్.. ఆలోచించేలా చేశావ్ ఉపాసన.. మన లోకల్ టాలెంట్ ట్రైబర్ ఆర్ట్‌ను ప్రమోట్ చేసేలా చేతి వృత్తుల వారు తయారు చేసిన వాటితో క్రిస్మస్ ట్రీని గొప్పగా అలంకరించావ్ అంటూ బన్నీ ప్రశంసలు కురిపించాడు.