చిరంజీవి వల్ల పాతికవేలు నష్టపోయిన ఐకాన్ స్టార్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నేటితరం హీరోలకు గట్టి పోటీగా నిలబడ్డారు.ఇకపోతే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి కూడా అదే స్థాయిలో క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కారణంగా అల్లు అర్జున్ పాతికవేల రూపాయలు నష్టపోయానని తెలియజేశారు. అయితే అల్లు అర్జున్ ఓ సందర్భంలో పాతికవేలు నష్టపోయారు అనే విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమా విషయమై అల్లు అర్జున్ కు తన స్నేహితునికి మధ్య చర్చ జరిగిందని అల్లు అర్జున్ తెలిపారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వేసే వీన స్టెప్ ఎంత ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిందే.అయితే ఈ పాట చేసే సమయంలో మెగాస్టార్ పక్కన హీరోయిన్ సోనాలి బింద్రే ఉందని తన ఫ్రెండ్ వాదించాడు.

ఈ పాటలో మెగాస్టార్ సోలో ఫర్ఫార్మెన్స్ చేశారని వీనస్టెప్ వేసే సమయంలో తన పక్కన ఎవరూ లేరని కేవలం రెడ్ కలర్ చొక్కా బ్లాక్ ప్యాంటు వేసుకుని చిరు గారు మాత్రమే ఉన్నారని అల్లు అర్జున్ వాదించారు.ఇలా ఇద్దరి మధ్య వాదన మొదలయ్యి పాతికవేల రూపాయల బెట్ కట్టామని అయితే చివరికి ఈ పాటలో చిరంజీవి గారి పక్కన సోనాలి బింద్రే కూడా ఉందని,తాను కేవలం మెగాస్టార్ చిరంజీవి డాన్స్ చూస్తూ మాత్రమే ఉండిపోయానని పక్కన హీరోయిన్ ఉందనే విషయాన్ని కూడా గుర్తించలేకపోయానని అల్లు అర్జున్ తెలిపారు.ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి వల్ల తాను పాతిక వేల రూపాయలు నష్టపోయానని ఓ సందర్భంలో తెలిపారు.