Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా చోటు చేసుకున్న అంశంపై అల్లు అర్జున్ తీవ్రస్థాయిలో వివాదంలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ కు చాలా మంది మద్దతు తెలుపగా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ పోస్టులు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై సినీనటి మాధవి లత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు ఇందులో భాగంగా మాధవి లత మాట్లాడుతూ సోషల్ మీడియా ఓపెన్ చేస్తేనే చాలు అల్లు అర్జున్ భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్ కు చాలా ఆటిట్యూడ్ ఉందని, ఎంత పొగరు. పైకి, కిందకు, పక్కకు చూశాడు. అబ్బబ్బా ఆ కళ్లల్లో ఎంత యాటిట్యూడ్ ఉంది. ఎంత బలుపు.. అని ఒకటే పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. అరెయ్ అల్లు అర్జున్ పుట్టడమే గోల్డెన్ కాదురా డైమండ్ స్పూన్‌తో పుట్టాడు.
అతనికి యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటి ఏమీ లేనటువంటి వేపాకు కరేపాకుగాళ్ళు ఆటిట్యూడ్ చూపిస్తుంటే అల్లు అర్జున్ ఎందుకు ఆటిట్యూడ్ చూపించకూడదు అంటూ ఈమె ప్రశ్న వేశారు.అతన్ని కామెంట్ చేస్తున్నావ్ నీ దగ్గర ఏముంది. నువ్వంత యాటిట్యూడ్ చూపించడానికి ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయడానికి నీకేం హక్కు ఉంది. 10 ఏళ్ల క్రితం అనుకుంట రామ్ చరణ్‌ది ఓ ఇంటర్వ్యూ చూశా.. మీకెందుకు ఇంత యాటిట్యూడ్ అనడిగితే ఎందుకుండకూడదు అన్నారు.
రామ్ చరణ్ చిరంజీవి కొడుకు అయితే ఆటిట్యూడ్ చూపించవచ్చు అదే బన్నీ అల్లు అరవింద్ కొడుకుగా ఆటిట్యూడ్ చూపించకూడదా అంటూ ప్రశ్నించారు. ప్రతిదీ స్లో మోషన్ లో పెడుతూ మీ బలుపు దించుతాం అంటూ పోస్టులు చేస్తున్నారు. ఏందిరా మీరు దించేది మీకేం చేతకాదు అంటూ మాధవి లత చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Konni kukkalaki Perfect ga ichepadesindhi 👌
My huge Respect to Madhavi Latha garu ❤️❤️ #AlluArjun pic.twitter.com/Pz4nfZ2lxM— Thaggadhele ™ 🐉 (@SSridattAA_Sam) December 29, 2024