షూటింగ్ సెట్‌లో ఒక్కో హీరో ఒక్కోలా ఉంటాడు. కొందరు వస్తుంటే పాజిటివ్ వైబ్స్, ఫుల్ ఎనర్జీ, జోష్ వస్తుంటుంది. కొందరు వస్తే మొత్తం యూనిట్ అలర్ట్ అవుతుంటుంది. అయితే అల్లు అర్జున్ సెట్‌లోకి వచ్చేసరికి అందరూ మంచి మూడ్‌లొ ఉండాలట. ఈ మేరకు కొన్ని విషయాలను బయటకు చెప్పేశాడు. తాజాగా సమంతతో బన్నీ పెట్టిన ముచ్చట్లు ఆహా యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. అందులో బన్నీ ఎన్నో విషయాలను పంచుకున్నాడు.
తాను సెట్‌లోకి వచ్చేసరికి మొదటగా కెమెరామెన్ మొహం, డైరెక్టర్ మొహం చూస్తానని వారు ఏ మూడ్‌లో ఉన్నారో గమనిస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ప్రత్యేకంగా హీరోయిన్ మొహాన్ని ఎక్కువగా గమనిస్తానని, ఒకవేళ వారి మూడ్ బాగా లేకపోతే వెంటనే డైరెక్టర్, నిర్మాతలకు చెప్పేస్తానని అన్నాడు. ఆమెకు ఏం కావాలో అది ఇచ్చేయండి.. బాయ్ ఫ్రెండ్‌తో గొడవ అయితే సెటిల్ చేసేద్దాం.. కలవకపోతే కలిసేలా చేద్దాం.. మొత్తానికి ఏదో ఒకటి చేసేద్దామని చెబుతుంటాడట.
హీరోయిన్ మంచి మూడ్‌లోకి రావాలంటే ఏదో చేయాలంటే అది చేసేస్తాడట.. ఐస్ క్రీమ్, చాక్లెట్ ఇలా ఏది కావాలంటే అది ఇవ్వమని చెబుతాడట. వారు మంచి మూడ్‌లో ఉంటేనే సీన్ కూడా బాగా వస్తుందని.. అందరూ మంచి మూడ్‌లో ఉండి షూటింగ్ చేస్తేనే రిజల్ట్ బాగా వస్తుందని బన్నీ చెప్పుకొచ్చాడు. అందుకు తాను సెట్‌కు బయల్దేరే ముందు ఎలాంటి చెడు విషయాన్ని వినదల్చుకోనని, ఫ్రెష్ మైండ్, మంచి మూడ్‌తోనే వెళ్తానని బన్నీ చెప్పుకొచ్చాడు.