సంక్రాంతి బరిలో అల్లరోడు కూడా చేరాడు !

allari naresh bangaru bullodu movie will be release on january second week

తెలుగు ప్రజలు కొత్త సంవత్సరంలో మొదటిగా చేసుకునే సంక్రాంతి పండుగ అంటే చిత్ర పరిశ్రమకి ఆసక్తి ఎక్కువగా చూయిస్తుంది. ఈ పండుగకి స్కూల్స్ , కాలేజెస్ కి సెలవలు ఇస్తారు ఆ టైం లో కొత్త మూవీస్ ని రిలీజ్ చేసి కాష్ చేసుకోవాలని నిర్మాతలు ఎదురు చూస్తారు. సరిగ్గా పండుగ నాటికి విడుదల చేసేందుకు సినిమాని ప్లాన్ చేసి పూర్తియు చేస్తారు. ఇక సంక్రాంతి పండుగ వస్తుందంటే సినిమా థియేటర్ల ముందు సందడే సందడి. అదే జోరులో హీరోలు కూడా తమ సినిమాలను విడుదల చేస్తారు.కానీ ఈ ఏడాది ఈ జోరు హుషారు ఎవరిలోనూ కనిపించడం లేదు. దానికి కరోనానే కారణం. కరోనా దెబ్బకు భయపడి ప్రేక్షకులు థియేటర్ల మొఖమైనా చూస్తారా అన్న అనుమానం నిర్మాతలను కలవరపెడుతోంది.

allari naresh bangaru bullodu movie will be release on january second week
allari naresh bangaru bullodu movie will be release in january second week

అయినా సరే మాస్ మహరాజ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చేసిన క్రాక్, టాలీవుడ్ ఎనర్జటిక్ హీరో రామ్ ద్వాపాత్రాభినయం పండించిన రెడ్, అక్కినేని హరో అఖిల్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, భల్లాలదేవగా అందరిని మెప్పించిన రానా దగ్గుపాటి నటించిన అరణ్య సినిమాలు ఇప్పటి వరకు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇటీవల తాజాగా ఈ పోరులోకి మరో హీరో వచ్చి చేరాడు. అల్లరితో అందరి మనసులు దోచుకుని హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ నటించిన ‘బంగారు బుల్లోడు’ సినిమా. ఈ చిత్రం పీవీ గిరి దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో పూజా ఝవేరీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే రలీజ్ అయిన టీజర్ మంచి ఆదరణ పొందింది. మరి ఈ పండుగ బరిలో ఎవరి బలం ఎంతో తెలుసుకోవాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.