ఇదేంటి అక్కినేని హీరోలు ముగ్గురు ఇలా చేశారు… వీరు కావాలనే ఇలా చేశారా…?

అలనాటి హీరో అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున కుమారులు ఇద్దరు అక్కినేని అఖిల్ అక్కినేని నాగచైతన్య కూడా హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం వీరు ముగ్గురు వరుస సినిమాలో బిజీగా ఉంటున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఈ అక్కినేని హీరోలు ముగ్గురు కూడా తమిళ దర్శకులతో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే వీరి ముగ్గురు కూడా తమ తదుపరి సినిమాలను తమిళ దర్శకుల చేతిలో పెట్టడంతో వీరు ముగ్గురు మాట్లాడుకునే ఇలా చేశారా? లేక యాదృచ్ఛికంగా ఇలా జరిగిందా ? అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇటీవల ‘ది గోస్ట్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాగార్జున ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు. ఈ సినిమా తర్వాత గాడ్ ఫాదర్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహనరాజా తో కలిసి సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇటీవల థాంక్యూ సినిమా ద్వారా క్లాస్ అందుకున్న అక్కినేని నాగచైతన్య కూడా తన తదుపరి సినిమాని తమిళ దర్శకుడితో కలిసి చేస్తున్నాడు. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట ప్రభువు దర్శకత్వంలో దరకేకుతున్న సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా… నాగచైతన్య కి జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. ఇక అక్కినేని యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రముఖ తమిళ దర్శకుడు పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఇలా అక్కినేని వారసులు ముగ్గురు తమిళ దర్శకుల సినిమాలలో నటించి హిట్ అందుకుంటారో లేదో చూడాలి మరి.