ఇండస్ట్రీ టాక్ : “నాని 30” కి అన్నీ మంచి శకునములే అట.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన భారీ హిట్ చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా “దసరా” కూడా ఒకటి. మరి ఈ భారీ సినిమా నాని కెరీర్ లో 29వ సినిమాగా రాగ ఈ చిత్రం అయితే నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

కాగా ఈ సినిమా తర్వాత అయితే మరో కొత్త దర్శకుడుతో తన కెరీర్ లో మైల్ స్టోన్ ప్రాజెక్ట్ 30వ సినిమాని అయితే ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాని నాని దసరా కంప్లీట్ అయిన వెంటనే ఏమాత్రం గ్యాప్ లేకుండా స్టార్ట్ చేసేసాడు. కాగా ఈ సినిమా అయితే ఇప్పటివరకు శరవేగంగా కంప్లీట్ అవుతూ ఉండగా..

ఈ సినిమా విషయంలో ఎంత పాజిటివ్ గా ఉంది అంటే ఈ చిత్రానికి పెట్టుకున్న టార్గెట్ కంటే ముందే సినిమా షూటింగ్ అయ్యిపోయేలా ఉందట. అంతే కాకుండా కొత్త నిర్మాతలు మొదట ఇంత మొత్తం అని ఒక బడ్జెట్ ని ఇవ్వడం ఈ సినిమా ఆ బడ్జెట్ కి ఇంకా చాలా తక్కువ లోనే కంప్లీట్ అయ్యిపోయింది అట.

దీనితో ఓ పక్క చాలా టైం మరో పక్క బడ్జెట్ కూడా చాలా మిగలడం అనేది చిత్ర యూనిట్ ఓ పాజిటివ్ సంకేతం అని చెప్పాలి. మరి ఈ సినిమా అయితే ఎప్పుడో డిసెంబర్ లో రిలీజ్ కి ఫిక్స్ చేశారు. అంటే మేకర్స్ కి చాలా సమయం మిగిలి ఉంది. మరి రిలీజ్ కూడా ప్రీ పోన్ ఏమన్నా అవుతుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రంలో సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుంది.