టైటిల్ చూసి సీత అంటూ మళ్లీ పురాణాల్లోకి వెళ్లకండి.. అలా అని ఆది పురుష్ సినిమా కూడా కాదండి. ఆ హెడ్డింగ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సీత గురించి. సీతగా అలియా భట్ సెట్స్ పైకి వచ్చేందుకు ఎన్ని రకాలుగా కష్టపడుతుందో తాజాగా చెప్పుకొచ్చింది. ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ తరుణం ఇప్పుడు వచ్చింది. సీతగా అలియా భట్ ఆర్ఆర్ఆర్ సెట్‌లో మార్చి ఏప్రిల్ నెలలోనే షూటింగ్ పూర్తి చేయాల్సింది. కానీ కరోనా వల్ల వాయిదా పడింది.
అలా వాయిదా పడ్డ ఆ షెడ్యూల్ ఇప్పుడు మొదలైంది. సీతగా పలకరించేందుకు అలియా భట్ హైద్రాబాద్‌లో అడుగుపెట్టింది. అయితే అలా అలియా అడుగు పెట్టిందో లేదో.. రామరాజు రామ్ చరణ్ నిహారిక పెళ్లికి కోసం ఉదయ్ పూర్ వెళ్లాడు. ఈ ఇద్దరూ ఇంకా ఆర్ఆర్ఆర్ సెట్ మీద కలుసుకోనేలేదు. ఇక ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరూ కలుసుకోవడమే కాదు.. జక్కన్న ఆధ్వర్యంలో ప్రేమ పాఠాలు కూడా పాడేసుకుంటారు. అయితే సెట్‌కు వెళ్లే ముందు అలియా భట్ ఎన్ని కష్టాలు పడుతుందో చెప్పే వీడియోను షేర్ చేసింది.
సీతగా అలియా భట్ మేకప్ వేయించుకునే ముందు ప్రతీ రోజూ హ్యాండ్స్ హీలింగ్ అనే ప్రక్రియను చేయాల్సి ఉంటుందట. ఈ ఫేస్ మసాజ్ చేశాకే మేకప్ వేసుకుంటుందట. మేము ప్రతీరోజూ మేకప్ వేసుకునే ముందు ఇలాంటి చిన్న ఫేస్ మసాజ్ చేసుకోవాల్సిందే.. హీలింగ్ హ్యా్ండ్స్ గురించి మీకు చెబుతాను అంటూ అలియా పేర్కొంది. మొత్తానికి అలియాను భరించడం మాత్రం ఆర్ఆర్ఆర్ యూనిట్ తడిసి మోపడవుతోందట. ఆమె స్టాఫ్ కోసమే లక్షలు లక్సలు దారబోయాల్సి వస్తోందట.