జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్‌కు నాగార్జున శంకుస్థాపన !

నిన్నమొన్నటి వరకు బిగ్‌బాస్ 4 హోస్ట్‌ చేస్తూ ఒకవైపు.. ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమాను పూర్తి చేస్తూ మరో వైపు బిజీ బిజీగా పనిచేసిన నాగార్జున ఇప్పుడు కాస్త ఫ్రీ అయ్యారు. ఈ ఖాళీ సమయంలో ఆయన సామాజిక కార్యక్రమాలతో సమయం గడుపుతున్నారు. అందులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్49లో ప్రత్యేకమైన మొక్కలు నాటారు.

12262020150916N86 | Telugu Rajyam

ఈ కార్యక్రమంలో వాల్గో ఇన్ ఫ్రా ఎండీ, సీఈవో శ్రీధర్ రావు, నాగ్ స్నేహితుడు సతీశ్ రెడ్డి, అశోక్ బాబు, స్థానిక కాలనీవాసులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగ్ స్థానికులతో మాట్లాడుతూ, వారిలో సామాజిక చైతన్యం పెంపొందించే ప్రయత్నం చేశారు. పర్యావరణ హితం కోరి మరిన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అక్కడివాళ్లు చెట్లు పెంచుతున్న వైనాన్ని అభినందించారు. నాగ్ ఈ సందర్భంగా ఓ చిన్నారిని తన ఒళ్లో కూర్చోబెట్టుకుని పిల్లలపై తన ప్రేమను చాటుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles