సమంత ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్స్ కూడా షాకయి షేకయ్యే పని చేసింది. లైఫ్ లో ఫస్ట్ టైం సమంత ఇలాంటి పనిచేసి అడ్డంగా బుక్కైందనే చెప్పాలి. ఇప్పటి వరకు భర్త నాగ చైతన్య తో అలాగే తను నటించిన హీరోలతో ఎంత చనువుగా ఉంటుందో చూశాము. అదంతా చాలా కామన్. భర్త తో ఎలా ఉన్నా ఫ్యాన్స్ సంబర పడతారు. ఇక సమంత నటించిన హీరోలతో క్లోజ్ నెస్ అంటే దాని గురించి ఎవరూ వేలెత్తి చూపే సాహసం చేయరు. ఎందుకంటే సమంత ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలకి అవకాశం ఇవ్వలేదు.
అంతేకాదు అక్కినేని కోడలు కాబట్టి పొరపాటున కూడా సమంత ని వేరే రకంగా కామెంట్ చేయాలంటే ఒళ్ళు దగ్గరపెట్టుకోవాల్సిందే. కాని ఇప్పుడు సమంత ప్రతీ ఒక్కరికీ తనని ఎంతగా కామెంట్ చేయాలో అంతగా కామెంట్ చేసేలా అవకాశం ఇచ్చింది. ఎంత పెద్దింటి కోడలైనా.. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా భర్త తో కాకుండా మరొకరితో అతి చనువుతో ప్రవర్తిస్తే ఏకి పారేస్తారు. ఇప్పుడు అదే పొరపాటు సమంత చేసి ఇన్నాళ్ళుగా తన మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం నాశనం చేసుకుందని అంటున్నారు. సాధారణం గా సమంత తన దగ్గర పనిచేసే వాళ్ళతో చాలా క్లోజ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళ అవసరాలకి కావలసిన సహాయం చేస్తుంటుంది.
ఇదంతా బాగానే ఉంది. కాని రీసెంట్ గా సమంత సోషల్ మీడియాలో ఒక ఫొటో పెట్టి మళ్ళీ డిలీట్ చేసింది. ఆ ఫొటో చూసిన ప్రతీ ఒక్కరు సమంతని బాగా ట్రోల్ చేస్తున్నారు. సోఫాలో పడుకున్న సమంత రిలాక్స్ అవుతు తన వద్ద నాలుగేళ్లుగా స్టైలిష్ గా వ్యవహరిస్తున్న ప్రీతమ్ జుకాల్కర్ మీద కాళ్ళు పెట్టింది. అంతేకాదు ఈ ఫోటోకు నాలుగేళ్లుగా కలిసి ఉన్నామన్న కామెంట్ తో పాటు ఒక లవ్ సింబల్ పెట్టారు. ఈ ఫోటోను ఇద్దరు ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసిన ఐ లవ్యూ అని పెట్టారు. ఇలాంటి షాకింగ్ ఫోటోను షేర్ చేయటంతో అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.