సమంత అనారోగ్యం పై స్పందించిన అఖిల్.. హర్షం వ్యక్తం చేస్తున్న అభిమానులు!

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా తెలుగు తమిళ్ కన్నడ భాషలలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన మంచి గుర్తింపు పొందిన సమంత ప్రస్తుతం హిందీలో కూడా వరుస సినిమాలలో నటించి అవకాశం అందుకుంటుంది. ఇది ఎలా ఉండగా నాతో కొంతకాలంగా సమంత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా సమంత తన అనారోగ్యం విషయం గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేస్తూ పోస్ట్ షేర్ చేసింది.

ఈ క్రమంలో “మయోసిటిస్‌ ” అనే వ్యాధి బారిన పడినట్లుగా సమంత వెల్లడించింది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు చెప్పారంటూ సమంత ట్వీట్ చేసింది. ప్రస్తుతం సమంత చేసిన ట్వీట్ కి పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆమె అనారోగ్య పరిస్థితుల నుండి తొందరగా కోలుకోవాలని ట్వీట్ లు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కినేని అఖిల్ కూడా సమంత తొందరగా కోలుకోవాలని ట్వీట్ చేశాడు. సమంత అనారోగ్యం పట్ల అఖిల్ సానుభూతి తెలియజేస్తూ… “అందరి ప్రేమాభిమానాలు నీకు మరింత బలాన్ని ఇస్తాయి డియర్ సామ్” అంటూ ట్వీట్ చేశాడు.

అయితే అక్కినేని కుటుంబం నుండి సమంత మాజీ భర్త నాగచైతన్య అలాగే నాగచైతన్య తండ్రి నాగార్జున కంటే ముందుగా అఖిల్ ఇలా సమంత అనారోగ్యం గురించి స్పందిస్తూ ఆమెకు సానుభూతి తెలియజేయడంతో అఖిల్ చేసిన పనికి సమంతా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సమంత నటించిన యశోద సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.