అక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇది అతని కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. నిర్మాతకి కూడా భారీ నష్టాలు మిగిల్చింది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులకి సారీ చెబుతూ నిర్మాత ట్వీట్ చేశారు. అనుకున్న స్థాయిలో ప్రేక్షకులని మెప్పించే చిత్రాన్ని ఇవ్వలేకపోయానని చెప్పారు.
అలాగే సరైన స్క్రిప్ట్ లేకుండా సినిమా చేయడం వలన ఈ రిజల్ట్ వచ్చిందని కూడా ఓపెన్ అయిపోయాడు. ఇదిలా ఉంటే తాజాగా హీరో అఖిల్ ఏజెంట్ సినిమాపై ఓపెన్ లెటర్ రిలీజ్ చేశారు. ఏజెంట్ సినిమా కోసం వర్క్ చేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న. అనుకోకుండా ఈ సినిమాని ఆశించిన స్థాయిలో డెలివర్ చేయలేకపోయాం.
అలాగే ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులు, ఫ్యాన్స్ కోసం ఇవ్వలేకపోయాను. అయితే ఈ ఏజెంట్ సినిమా విషయంలో నాకు అతని పెద్ద సపోర్ట్ గా నిలబడ్డ నిర్మాత అనిల్ సుంకర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాపై నమ్మకంతో సినిమాని కొనుగోలు చేసిన డిస్టిబ్యూటర్స్ కి, అలాగే మీడియా ప్రతినిధులకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
మీరు ఇచ్చిన ప్రేమ, సపోర్ట్ తో నేను మరింత హార్డ్ గా వర్క్ చేస్తాను. మనస్పూర్తిగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ సినిమాల విషయంలో మరింత స్ట్రాంగ్ గా నన్ను నేను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసి మీ నమ్మకాన్ని తిరిగి సొంతం చేసుకుంటా అని అఖిల్ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖలో దర్శకుడు సురేందర్ రెడ్డి పేరుని అఖిల్ ప్రస్తావించకపోవడం సంచలనంగా మారింది.
మరో వైపు అఖిల్ లెటర్ పై నిర్మాత రియాక్ట్ అయ్యారు. డియర్ అఖిల్ నీ హార్డ్ వర్క్, డెడికేషన్, కృషి తిరిగి బౌన్స్ బ్యాక్ బ్యాక్ అయ్యేలా చేస్తాయి. అతి త్వరలో నీ సక్సెస్ ని నేను చూస్తాను అని అనిల్ సుంకర రీట్వీట్ చేశారు. మొత్తానికి ఏజెంట్ ఫెయిల్యూర్ కి కారణం సురేందర్ రెడ్డి అని ఇటు అఖ్జిల్, అటు నిర్మాత అనిల్ సుంకర బలంగా డిసైడ్ అయినట్లుగా వారి ట్వీట్ లబట్టి తెలుస్తోంది.