మెగా బ్యానర్‌లో అక్కినేని అఖిల్.! దర్శకుడు అతడేనా.?

మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున అత్యంత సన్నిహితుడు.! అంతే కాదు రామ్ చరణ్ – అఖిల్ మధ్య కూడా అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి.

కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌లో అక్కినేని అఖిల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోందంటూ చాన్నాళ్ళ క్రితం ఓ ప్రచారం జరిగింది. అయితే, అది ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కాంబినేషన్ వర్కవుట్ అయ్యేందుకు మార్గం సుగమం అయ్యిందట. అయితే, మెగా కాంపౌండ్ నుంచి ఇంకో బ్యానర్ రాబోతోందనీ, అక్కినేని కాంపౌండ్ నుంచీ ఇంకో కొత్త బ్యానర్ వస్తోందనీ.. ఈ రెండిటి కలయికలో అఖిల్ హీరోగా సినిమా రావొచ్చనీ తెలుస్తోంది.

ఇటీవల ఓ సూపర్ హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ అఖిల్‌తో సినిమా తెరకెక్కించబోతున్నారట.. మెగా అక్కినేని నిర్మాణ సంస్థల కలయికలో. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.