అఖిల్.. మరో కన్ఫ్యూజన్?

అక్కినేని నాగార్జున నట వారసుడు అఖిల్ కమర్షియల్ హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి అఖిల్ వర్క్ చేశాడు. అతను ఏజెంట్ కోసం ఎంత కష్టపడ్డాడో ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. అయితే సురేందర్ రెడ్డి మాత్రం అఖిల్ కష్టాన్ని వృధా చేశారు.

సరైన ఎగ్జిక్యూషన్ లేకోవడం ఏజెంట్ డిజాస్టర్ అయ్యింది. అఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా మారిపోయింది. ఈ సినిమా దెబ్బకి భాగా డిస్టర్బ్ అయిన అఖిల్ కొద్ది రోజులు ఫారిన్ టూర్ వెళ్లి రిలాక్స్ అయ్యి వచ్చాడు. ఇక ఏజెంట్ మూడ్ నుంచి బయటకొచ్చి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ పై దృష్టి పెడుతున్నాడు.

అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అఖిల్ కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ లో ఒక భారీ పాన్ ఇండియా మూవీకి ఏజెంట్ షూటింగ్ టైమ్ లోనే అఖిల్ కమిట్ అయ్యాడు. అయితే ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత మరలా భారీ బడ్జెట్ మూవీ అంటే రిస్క్ తో కూడుకున్నది. దీనిపై అఖిల్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

మరో వైపు అఖిల్ తో సినిమాలు చేయడం కోసం ఇద్దరు దర్శకులు రెడీగా ఉన్నారు. వారిలో వంశీ పైడిపల్లి ఒకరు. ఈ ఏడాది వారసుడుతో హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి అఖిల్ కోసం మంచి కథ సిద్ధం చేసారంట. మరో వైపు దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని అరంగేట్రంతోనే తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఈ దర్శకుడు ఒక కల్ట్ కంటెంట్ ని అఖిల్ కోసం రెడీ చేసాడంట.

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కావడం ఇప్పటికే దసరాతో వంద కోట్ల ప్రాజెక్ట్ చేయడంతో అఖిల్ కి శ్రీకాంత్ తో మూవీ చేయాలని ఉందనే మాట వినిపిస్తోంది. అలాగే వంశీ పైడిపల్లి కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గానే ఉన్నారు. అయితే ఇప్పుడు అఖిల్ దగ్గర క్లాస్, మాస్ అంటూ రెండు ఛాయస్ లు ఉన్నాయి. మరో వైపు ఫిక్షనల్ ఫాంటసీ మూవీ కథ రెడీగా ఉంది. వీటిలో దేనిని సెలక్ట్ చేసుకొని నెక్స్ట్ సెట్స్ పైకి వెళ్తాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే అఖిల్ మాత్రం ఈ సారి రొటీన్ గా కాకుండా బలమైన కంటెంట్ తో కొత్తగా ట్రై చేయాలని ఆలోచిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల మాట.