అఖిల్‌కు కొంచెం గ్యాప్ ఇవ్వండయ్యా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద యుద్ధాలు గట్టిగానే జరగనున్నట్లు చాలా క్లియర్ గా అర్ధమవుతోంది. 2020 కరోనా దెబ్బకు ఎంతో మంది హీరోలు 2021 రిలీజ్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఎదురుచూపుల కంటే కూడా ఇప్పుడు హీరోలే ఎక్కువగా హాలిడేస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతికి అగ్ర హీరోలు వెనుకడుగు వేసేశారు.

ఇక అందరిచూపు సమ్మర్ పై పడింది. అఖిల్ కూడా తన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాని సమ్మర్ లో ఖాళీ టైమ్ ను చూసి విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ పెద్ద సినిమాలు కూడా సమ్మర్ ను గట్టిగానే టార్గెట్ చేశాయి. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఏప్రిల్ 9న రానుండగా, నాని టక్ జగదీష్ ఏప్రిల్ 16న రానుంది. ఇక మెగాస్టార్ ఆచార్య మే 9న వచ్చే ఛాన్స్ ఉంది. ఇక దాదాపు వీరి సినిమాలతో పోటీ పడకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ముఖ్యమైన తేదీలలో మంచి హైప్ ఉన్న సినిమాలే వస్తుండడంతో అఖిల్ సినిమా నిలదొక్కుకోవడం కష్టమే. ఎవరో ఒకరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కు రెండు వారాలైనా గ్యాప్ వదలాల్సిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాపై అయితే ఇప్పటివరకు ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు. కనీసం సాంగ్స్ తో కూడా బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం లేదు. మరి సినిమా విడుదల తరువాత ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.