Home News అఖిల్ 5 ని పట్టాలెక్కించబోతున్న సురేందర్ రెడ్డి ..?

అఖిల్ 5 ని పట్టాలెక్కించబోతున్న సురేందర్ రెడ్డి ..?

అఖిల్ 4 గా ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సెట్స్ మీద ఉంది. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా వస్త్తున్న ఈ సినిమా మీద అక్కినేని అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు.

Most Eligible Bachelor Poster | Telugu Rajyam

ఇక ఈ సినిమా సక్సస్ అఖిల్ తో పాటు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి చాలా కీలకం. అఖిల్ నుంచి ఇప్పటి వరకు 3 సినిమాలు వచ్చినా సరైన హిట్ దక్కింది లేదు. ఇక బొమ్మరిల్లు భాస్కర్ కి గత కొన్నేళ్ళుగా సక్సస్ లు లేక అవస్థలు పడుతున్నాడు. దాంతో భాస్కర్ మీద పెద్ద బాధ్యతే ఉంది. ఇదిలా ఉంటే అఖిల్ 5 సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అఖిల్ 5 కి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వర్క్ మొత్తం ఓ కొలిక్కి రావడం తో ఇక షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.

ఇక సురేందర్ రెడ్డి కి స్టైలిష్ డైరెక్టర్ అన్న పేరున్న సంగతి తెల్సిందే. తన నుంచి సినిమాలకి ఎక్కువ గ్యాప్ వస్తున్నా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ సినిమానే ఇస్తున్నాడు. సురేందర్ రెడ్డి గత చిత్రం మెగాస్టార్ తో తీసిన సైరా. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా సైరా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సురేందర్ రెడ్డి ఒకేసారి పవన్ కళ్యాణ్ .. అఖిల్ సినిమాలని అనౌన్స్ చేశాడు. కాగా అఖిల్ సినిమాని ఫిబ్రవరి నెలలో సురేందర్ రెడ్డి సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నాడట. మార్చ్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరిపి విజయదశమి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Posts

మద్యం మత్తులో షణ్ముఖ్ హల్‌ చల్.. కార్లు, బైకులను ఢీకొట్టి బీభత్సం !

మద్యం మత్తులో టిక్‌టాక్‌ స్టార్ షణ్ముఖ్ హల్‌చల్ సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్ వుడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు, బైకులను ఢీకొట్టి...

అమెరికా ఇండియాకి ఎన్ని లక్షల కోట్లు బాకీ ఉందంటే ?

అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. అంతా ఇంతా కాదు. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. అభివృద్ది చెందిన దేశంగా...

మూడో కూటమిగా కమల్‌హాసన్-శరత్‌ కుమార్… రంజుగా మారుతున్న తమిళ రాజకీయం!

చెన్నై: డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్‌ కుమార్‌ బయటకు వచ్చి కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలలో రోజురోజుకు వేడి...

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు … మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బరిలో 93 మంది !

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా , నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది విత్ డ్రా చేసుకున్నారు. మహబూబ్‌నగర్-...

Latest News