అఖండ 2 కూడా వచ్చే సంవత్సరమే.. హ్యాట్సాఫ్ టు బాలయ్య!

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా డాకు మహారాజ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి బాలకృష్ణ లుక్ రివిల్ అయింది. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అయితే ఈ సినిమా సంక్రాంతికి రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. టీజర్ చూసిన బాలయ్య ఫ్యాన్స్ సంక్రాంతికి బాలయ్య విజేతగా నిలవడం ఖాయం అంటున్నారు.

ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కి ఈ మధ్యనే గుమ్మడికాయ కొట్టారు. త్వరలోనే ప్రమోషన్స్ కి రెడీ అవుతున్నట్లు మూవీ టీం నుంచి సమాచారం. ఇదే సమయంలో బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేమిటంటే బాలయ్య అఖండ 2 సినిమా కూడా 2025 లోనే విడుదల అవుతున్నట్లు మూవీ టీం ప్రకటించింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆఖండ సినిమాకి సీక్వెల్ అని అందరికీ తెలిసిందే.

తాజాగా మూవీ టీం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలియజేస్తూ అలాగే రిలీజ్ డేట్ విడుదల చేసింది. 2025 సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అఖండ సినిమాలో శివ భక్తుడిగా కనిపించి మెప్పించిన బాలకృష్ణ ఈ సినిమాలో మరింత పవర్ ఫుల్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం పక్కన పెడితే నేటి యువతరం హీరోలు రెండు సంవత్సరాలకి ఒక సినిమా, కొందరైతే మూడు నాలుగు సంవత్సరాలకి ఒక సినిమా తీస్తున్నారు.

అయితే 60 ల వయసులో ఉన్న బాలకృష్ణ మాత్రం సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అందులోనూ ఆయన సినిమాలు మాత్రమే కాకుండా ఒకవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పనులు చూస్తూ మరొకవైపు తన కొడుకు మోక్షజ్ఞ మూవీ లాంచింగ్ పనులు చూస్తూ మరొకవైపు ఆన్ స్టాపబుల్ షో ని హోస్ట్ చేస్తూ ఆ షోకే ఓ రేంజ్ తీసుకువచ్చారు బాలయ్య. అందుకే ఫ్యాన్స్ కి బాలయ్య పేరు వింటేనే పూనకాలు వస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.