పాన్ ఇండియా మూవీగా అఖండ 2.. బోయపాటి ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా!

దర్శకుడు బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ ఇద్దరు కాంబినేషన్ అంటే అది బ్లాక్ బస్టర్ హిట్టే అని అర్థం. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి ఇప్పుడు నాలుగవ సినిమాగా అఖండ 2 రాబోతుంది. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా తెరక్కించబోతున్న బోయపాటి పాన్ ఇండియా లెవెల్ లో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలయ్య మరింత శక్తివంతమైన పాత్రలో కనిపించేందుకు సన్నహాలు చేస్తున్నారు.

ఈ సినిమాని తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ ఎత్తున ప్రమోషన్స్ ఇస్తుండటంతో ఆఖండ 2 పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అఖండ సినిమా టైమ్ లోనే ఈ మూవీ వైబ్స్ నార్త్ లో కూడా పాజిటివ్గా కనిపించాయి. అందుకే ఇప్పుడు అక్కడ అఖండ సీక్వెల్ తాండవం ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి.

డివైన్ టచ్ లో ఉన్న మన తెలుగు కంటెంట్ కి నార్త్ లో మంచి క్రేజ్ ఉంది అలాగే అఖండ 2 లో డివైన్ టచ్ బాగానే ఉండటంతో ఈ సినిమా అక్కడ కూడా ప్రభంజనం సృష్టిస్తుంది అని మంచి నమ్మకం మీద ఉన్నారు మూవీ టీం. అంతేకాకుండా బోయపాటికి ఈ సినిమా పాన్ ఇండియాగా ఒక విజిటింగ్ కార్డు లా ఉపయోగపడబోతుందని కూడా అంటున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి అజంట ఈ చిత్రాన్ని నిర్మించారు.

బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మొట్టమొదటి ఫ్యాన్ ఇండియా సినిమా ఇది. సినిమాకి ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా సంతోష్ డి దేటకే తోపాటు సి రాంప్రసాద్ ఫోటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, ఎడిటర్ గా తమ్మి రాజు చేస్తున్నారు. మరి పాన్ ఇండియా వైడ్ గా బోయపాటి తన సత్తాని ఏమాత్రం రుజువు చేసుకోగలడో వేచి చూడాల్సిందే.