Aham : ‘అహం రీబూట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన విజయేంద్ర ప్రసాద్….!

Aham : అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ‘ప్రేమకథ’ చిత్రంతో పరిచయమయ్యాడు హీరో సుమంత్, యువకుడు,సత్యం మహానంది,గోదావరి, క్లాస్ మేట్స్, మళ్లీ రావా సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అంతే కాకుండా బాలకృష్ణ హీరోగా తీసిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను పోషించారు. సుమంత్ సినిమాలు చేయడం లో గ్యాప్ తర్వాత ప్రస్తుతం తాజాగా అహం రీబూట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అయితే తాజాగా అహం రీబూట్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను దేశం గర్వించదగ్గ సినిమాలకు కథలు అందిస్తున్న విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.వాయుపుత్ర ఎంటర్ టైన్‌మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా, రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు ఈ చిత్రన్ని నిర్మిస్తున్నారు. పోస్టర్ విడుదల చేసిన తర్వాత రచయి విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ…సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నటిస్తున్న సుమంత్‌కి, ఇతర నటీనటులకి.. అలాగే దర్శకనిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు అభినందనలు, ఇలాంటి కథలకు ఇప్పుడు డిమాండ్ మరింత పెరిగింది.ఈ కాన్సెప్ట్ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది,అని చెప్పారు.

ఇక ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ… ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన విజయేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ చిత్రంతో ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతున్నాము. అనుకోని సంఘటనల కారణంగా మనిషిలోని కొత్త కోణాలు, శక్తులు బయటకు వచ్చినపుడు, అవి చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. అలాంటి కథే ‘అహం రీబూట్’. ఈ సినిమాకి సుమంత్ నటన హైలెట్ గా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రన్ని జూన్ మొదటి వారం లో విడుదల చేయడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.