ఏజెంట్.. అప్డేట్స్ ఉన్నా సౌండ్ లేదు!

అక్కినేని అఖిల్‌కు సరైన కమర్షియల్ హిట్‌ అయితే ఇప్పటి వరకు లేదు. ఆయన గతేడాది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు సాధించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజ హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కిన ఆ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగానే చేరువైంది. అయినప్పటికీ ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ అయితే సాధించ లేకపోయాడు. ప్రస్తుతం అఖిల్ ఆశలన్ని ఏజెంట్‌ సినిమాపైనే ఉన్నాయి.

ప్రస్తుతం అఖిల్ చేస్తోన్న ఏజెంట్ మూవీ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్‌ చూస్తే అర్థం అవుతోంది. ఇక ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్‌ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. అఖిల్ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నప్పటికీ… ఈ సినిమా నుంచి అయితే వస్తోన్న అప్‌డేట్ ఆకట్టుకోలేకపోతుంది.

ఏజెంట్ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమాను ఎట్టకేలకు ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ క్రమంలో మేకర్స్‌ వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి వస్తోన్న అప్‌డేట్‌లు సినిమాపై హైప్ క్రియేట్ చేయలేక పోతున్నాయి.

ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అంటే దాదాపు నెల రోజుల సమయం ఉంది. అయినా.. ఈ సినిమా గురించి ప్రమోషన్స్ లేవు. అందులోనూ ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతుంది. రిలీజ్ అయిన పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. వాటికి ప్రేక్షకుల నుంచి సరైన రెస్పాన్స్ అయితే రావట్లేదు. అయినా.. ఈ సినిమా యూనిట్ శ్రద్ధ తీసుకోవడం లేదు. ఇక ఇలాగే ఉంటే.. ఈ సినిమా గట్టేక్కడం కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు.

యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ స్టార్‌ మమ్ముట్టి కీలకపాత్ర పోషించాడు. ఏకే ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి సురేంద‌ర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య న‌టిస్తుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. చూడాలి ఈ సినిమా ఏ మేర ఆకట్టుకుంటుందో.