గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో మరియు సినిమాలలో వరుసగా బిజీగా ఉండగా తాను అయితే ఇప్పుడు దర్శకుడు నటుడు సముద్రఖని తో సినిమా వినోదయ సీతం రీమేక్ లో బిజీగా ఉన్నాడు. ఇక మరో పక్క పవన్ కి మరియు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కి ఎలాంటి సాన్నిహిత్యం ఉందొ అందరికీ తెలిసిందే.
ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతే కాకుండా జల్సా సినిమా నుంచి స్టార్ట్ అయ్యిన వీరి ప్రయాణం లేటెస్ట్ గా భీమ్లా నాయక్ వరకు కూడా వచ్చింది. మరి నెక్స్ట్ కూడా వినోదయ సీతం లోనీ త్రివిక్రమ్ ప్రమేయం ఉంది. ఇక ఇలా పవన్ సినిమాల్లో సగం త్రివిక్రమ్ ప్రమేయం లోనే జరుగుతూ ఉండగా లేటెస్ట్ గా అయితే పవన్ చేయబోయే మరో సినిమాలో కూడా త్రివిక్రమ్ ప్రమేయం ఉందట.
కాగా ఈ సినిమాని దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించనున్న సినిమాపై కామెంట్స్ చేసాడు. ఈ సినిమాకి అయితే బేస్ లైన్ లో త్రివిక్రమ్ నే అందిస్తున్నట్టుగా తెలిపాడు. త్రివిక్రమ్ పవన్ కోసం ఆ లైన్ అనుకోని నాకు చెప్పారని దానిని ఇంకా కథ పరంగా డెవలప్ చెయ్యాల్సి ఉందని తెలిపాడు.
దీనితో అయితే ఈ రకంగా కూడా త్రివిక్రమ్ పవన్ కాంబో అసలు తగ్గట్లేదు అని చెప్పుకోవాలి. కాగా సుధీర్ వర్మ చేసిన లేటెస్ట్ సినిమా మాస్ మహారాజ రవితేజ నటించిన “రావణాసుర” అయితే ఇప్పుడు ఏప్రిల్ 7న రిలీజ్ కి రానుంది.