“దేవర”.. మళ్ళీ పాదఘట్టం వైబ్స్??

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ ఉన్న పలు చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న చిత్రం “దేవర” కూడా ఒకటి. మరి ఎన్టీఆర్ తానా గ్లోబల్ హిట్ RRR చిత్రం తర్వాత చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది కావడంతో ఈ చిత్రం పై మంచి హైప్ ఉంది.

పైగా దర్శకుడు కొరటాల శివ చేస్తున్న సినిమా ఇది కావడంతో ఈ చిత్రం మంచి కసిగా పవర్ ఫుల్ సబ్జెక్టుతో చేస్తున్నట్టుగా కూడా సినీ వర్గాల్లో టాక్ ఉంది. అయితే సినిమా సబ్జెక్టు ఏమో కానీ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేస్తున్న లుక్ పోస్టర్స్ మాత్రం డెఫినెట్ గా అంచనాలు అందుకునేలా లేవు అని చెప్పక తప్పదు.

ఇక ఈ చిత్రం నుంచి మొదటగా వచ్చిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కె అంత రెస్పాన్స్ రాలేదు. దీనితో ఫ్యాన్స్ కూడా చాలా వరకు డిజప్పాయింట్ అయ్యారు. అయితే ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా ఈ సినిమా విలన్ లుక్ కూడా చేరింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాను విలన్ గా చేస్తున్న రోల్ నుంచి నిన్ననే మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా పెద్ద ఎత్తున డిజప్పాయింట్ అయ్యారు. మరి ఈ చిత్రంలో అయితే సైఫ్ లుక్ చూసి మళ్ళీ ఏదో తేడాగా ఉందని అంటున్నారు ఇక చాలా మంది అయితే మళ్ళీ ఆచార్య వైబ్స్ కూడా ఎందుకో కనిపిస్తున్నాయని అంటున్నారు. దీనితో ఈ చిత్రం విషయంలో ఎక్కడో నెగిటివ్ టాక్ స్టార్ట్ అవుతుంది. మరి అసలు కొరటాల ఏం చేస్తున్నాడో సినిమా ఏమవుతుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది ఉగాది వరకు ఆగాల్సిందే.