” వి ” సినిమా రిజల్ట్ తర్వాత కూడా ఏంటీ నాని నువ్వు ..!

నేచురల్ స్టార్ నాని ఇటీవలే వి సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా భారీ సక్సస్ కానప్పటికి నిర్మాతలు మాత్రం సేఫ్ గా బయట పడ్డారు. నాని, సుధీర్ బాబు లకి మంచి పేరు వచ్చింది. అయితే నాని కి ఈ హిట్ ఏమాత్రం సరిపోలేదు. గత కొంత కాలంగా భారీ సక్సస్ కోసం చూన్నాడు. కాని అన్ని యావరేజ్, బిలో యావరేజ్ గానే నిలిస్తున్నాయి. నాని సూపర్ హిట్ అందుకుంది నిన్నుకోరి సినిమాతోనే, జెర్సీ .. గ్యాంగ్ లీడర్ భారీ సక్సస్ లు గా నిలబడలేకపోయాయి.

V Movie Review , Nani's V Movie Review

అయితే నాని మార్కెట్ గాని .. నాని తో సినిమాలు తీసే మేకర్స్ గాని తగ్గలేదు. ఇప్పటికే వరసగా నాలుగు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉండగా వాటిలో ఒక సినిమా సగ భాగం టాకీ పార్ట్ కూడా కంప్లీటయింది. నాని కి నిన్ను కోరి లాంటి భారీ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలో టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఒక సినిమా మొదలవబోతుంది.

Bhale Bhale Magadivoy - Disney+ Hotstar

ఈ రెండు సినిమాలు కాకుండా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘భలే భలే మగాడివోయ్’ కాంబినేషన్ మళ్ళీ రిపీటవబోతుందని సమాచారం. మారుతి, నాని కలిసి చేయబో ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించనున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ క్కన్ఫర్మేషన్ త్వరలో రానుందని సమాచారం. అయితే ఈ సినిమా ‘భలే భలే మగాడివోయ్’ కి సీక్వెల్ ఆ లేక కొత్త కథ అన్నది తెలియాల్సి ఉంది. అలాగే నూతన దర్శకుడు తెరకెక్కించబోయో మరో ప్రాజెక్ట్ కి కూడా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన కూడా త్వరలో వెలువడనుందట.

అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ సారి నాని నుంచి భారీ హిట్ కావాలని కోరుకుంటున్నారు. వి సినిమా రిజల్ట్ తర్వాత కూడా నాని వరసగా సినిమాలని అనౌన్స్ చేయడం బాగానే ఉంది. కాని చాలాకాలంగా ఎదురు చూస్తున్న పెద్ద హిట్ మాత్రం దక్కడం లేదు. మరి నాని నుంచి ఎందుకు అందరూ కోరుకుంటున్న హిట్ పడటం లేదో నాని కైనా తెలుసా ..అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయట. చూడాలి మరి టక్ జగదీష్ ఎలాంటి సక్సస్ ని ఇస్తుందో.