సినిమాలకు దూరమై సమంత పెళ్లి చేసుకోవాలనుకుంటోందా.? అంటే అవుననే అంటున్నాయ్ టాలీవుడ్ వర్గాలు. కుటుంబ సభ్యుల సూచన మేరకు సమంత పెళ్లికి సిద్ధమవుతోందట. మయోసైటిస్ నుంచి సమంత ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
ఈ వ్యాధి కారణంగా తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురి కావల్సి వస్తుందట. అర్ధం చేసుకునే జీవిత భాగస్వామి వుంటే, జీవితం సాఫీగా సాగుతుందట. అందుకే మంచి భర్త దొరికితే, పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటోందట సమంత.
ఆ దిశగానే అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాల నుంచి తాత్కాలికి విరామం అంటూ ఈ మధ్య ప్రచారం జరిగింది సమంత విషయంలో. అయితే, అది తాత్కాలికం కాదనీ, శాశ్వత దూరమే అని సమంత సన్నిహిత వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.
ఒకవేళ తాత్కాలికమే అయినా అది మూడు నాలుగేళ్లకు పైనే ఆ విరామం వుండొచ్చని అంచనా వేస్తున్నారు. సినీ పరిశ్రమతో అస్సలు సంబంధం లేని వ్యక్తిని సమంత పెళ్లాడాలనుకుంటోందట.