అక్కినేని తరవాత చిరంజీవికే ఆ గౌరవం!

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవిని దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ వరించింది. ఈ పురస్కారం చిరంజీవి స్వయంకృషికి తగ్గ ప్రతిఫలంగా సినీ ప్రియులు, అభిమానులు కొనియాడుతున్నారు. అయితే ఇన్నేళ్ల తెలుగు సినీ చరిత్రలో పద్మ విభూషణ్‌ పురస్కారం ఇద్దరికి మాత్రమే దక్కింది.

తొలుత 2011లో నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు దక్కింది. టాలీవుడ్‌లో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్న మహోన్నత వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. ఆయనకు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు, పద్మ విభూషణ్‌, పద్మశ్రీ, కలైమామణి, రఘుపతి వెంకయ్య అవార్డు, ఏడు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, జాతీయ ప్థాయిలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కాళిదాసు లాంటి ఎన్నో పేరొందిన అవార్డులు అందుకున్నారు.

తాజాగా ఆ ఘనత మెగాస్టార్‌ చిరంజీవికి మాత్రమే దక్కింది. తెలుగు సినీ రంగంలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఆ ఘనత దక్కించుకున్న నటుడిగా చిరంజీవి నిలిచారు. దక్షిణాదికి చెందిన కళారంగంలో తమిళనాట ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం(2021), ఇళయరాజా (2018), కె.జె.ఏసుదాసు(2017), రజనీకాంత (2016) వంటి ఉద్దండులకు పద్మ విభూషణ్‌ వరించింది. తెలుగు ఇండస్టీల్రో మాత్రం ఈ పురస్కార ఘనత అక్కినేని నాగేశ్వరరావు, ఆ తర్వాత చిరంజీవికే దక్కింది.