అడివి శేష్ ‘హిట్-2’వాళ్ళంతా కుళ్ళకునేలా చేస్తోంది.!

సింగిల్ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్లయిపోతున్నారు కొందరు. అడివి శేష్ వ్యవహారం వేరు. మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు అడివి శేష్‌ని. స్క్రిప్టులో వేలు పెట్టేస్తాడన్న విమర్శలు కొంతమంది యంగ్ హీరోలపై వచ్చినట్లు అడివి శేష్ మీద రావు.

ఇక, ‘హిట్-2’ సక్సెస్‌తో కొందరు యువ హీరోలు కుళ్ళకుంటున్నారట. ‘హీరో అంటే అడివి శేష్‌లా వుండాలి..’ అంటూ ఈ సినిమా హిట్టయ్యాక ఓ యంగ్ హీరో వద్ద సన్నిహితులు ప్రస్తావిస్తే, అదో పెద్ద రచ్చగా మారిపోయిందని తెలుస్తోంది.

సినిమా పరిశ్రమలో ఇగోలు తక్కువేమీ కాదు. వున్నమాటంటే ఉలుకెక్కువ కొంతమందికి. రాత్రికి రాత్రే స్టార్లయిపోయేవాళ్ళకి ఈ టెంపర్‌మెంట్ కాస్త ఎక్కువే. ఆ టెంపర్మెంట్‌తోనే ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ దూరం చేసుకోవాల్సి వచ్చింది ఓ యంగ్ హీరోకి. అతనే ఇప్పుడు ‘హిట్-2’ సక్సెస్‌ని జీర్ణించుకోలేకపోతున్నాడట. ఎవరా యంగ్ హీరో.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. ఆ యంగ్ హీరో మీద, ‘కెలుకుడు’ ఆరోపణలు గట్టిగానే వున్నాయ్.