అడివి శేష్ హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

శైలేష్ దర్శకత్వంలో అడివి శేష్ మీనాక్షి చౌదరి జంటగా నటించిన క్రైమ్ త్రిల్లెర్స్ చిత్రం హిట్ 2. హిట్ సినిమాకి సీక్వెల్ చిత్రంగా వస్తున్నటువంటి ఈ సినిమా డిసెంబర్ రెండవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో అడివి శేష్ పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ భారీగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నవంబర్ 28వ తేదీ హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు. ఈ విషయంలో టీమ్ అధికారిక ప్రకటన చేశారు.ఈ క్రమంలోనే ప్రత్యేకంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ప్రకటన చేస్తూ పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక కోసం ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారు అనే విషయం గురించి తెలియాల్సి ఉంది.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ పోస్టర్స్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక శేష్ మేజర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని ఆదుకోవడంతో హిట్ 2 సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.