సింగిల్ క్యారెక్టర్‌తో సినిమాను నడిపించడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి ప్రయోగమే టాలీవుడ్ హీరో ఆదిత్య ఓం చేయబోతున్నారు. ’లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వస్తున్నారు.
ఈసారి ఆదిత్య ఓం ’బందీ’ అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో అందరినీ ఆకట్టుకునేందుకు రాబోతున్నారు. గల్లీ సినిమా బ్యానర్‌పై ఈ మూవీని వెంకటేశ్వరరావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తుండగా.. తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్లో సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఒక సగటు మనిషి కోరుకునేవి ఎలా ఉంటాయో చూపించారు. ఏ మనిషైనా ఆహారం, నీరు, డబ్బు, స్వాతంత్య్రం కోరుకుంటారు. స్వేచ్చగా విహరించాలని అనుకుంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఏర్పడిన ఘట్టాలనే బంధీగా రూపొందించారు.
ఇక ఈ ట్రైలర్లో అన్ని రకాల ఎమోషన్స్‌ను ఆదిత్య ఓం చూపించారు. చివరకు నగ్నంగా కనిపించే షాట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరచడం ఖాయం. అందుకే ఈ ట్రైలర్ ప్రస్తుతం వైరల్‌గా మారి టాప్‌లో ట్రెండ్ అవుతోంది. విశేషం ఏమిటంటే.. ఈ ట్రైలర్లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం.
ఈ చిత్రానికి వీరల్, లవన్, సుదేష్ సావంత్ సంగీతాన్ని అందించగా.. మధుసూధన్ కోట సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించారు. దేశంలోని పలు అటవీ ప్రాంతాల్లో ఈ మూవీని షూట్ చేసినట్లుగానూ.. ఇందులో ఆదిత్య ఓం ఎలాంటి డూప్ లేకుండా అన్ని రకాల స్టంట్స్ చేసినట్లుగా మేకర్స్ చెప్పుకొచ్చారు. మూడేళ్లు కష్టపడి ఏడాదిలో ఉండే అన్ని రుతువుల్ని కవర్ చేస్తూ ఈ మూవీని షూట్ చేసినట్లుగా వారు పేర్కొన్నారు. పర్యావరణ సంరక్షణ విూద తీసిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు.