సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ప్రెస్ నోట్

తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ తమ యొక్క మరో ప్రతిష్టాత్మకమైన షాపింగ్‌ మాల్‌ను నేడు మన కూకట్ పల్లి (కె పి హెచ్ బి పిల్లర్ నంబర్ 771) సినీ నటి శ్రీలీల. మరియు గౌరవనీయులైన శ్రీ మాధవరం కృష్ణారావు గారు కూకట్ పల్లి (ఎమ్మెల్యే), గౌరవనీయులైన శ్రీ అరికపూడి గాంధీ గారు శేరిలింగంపల్లి ( ఎమ్మెల్యే), గౌరవనీయులైన శ్రీ నవీన్ గారు కూకట్ పల్లి (ఎమ్మెల్సీ) గార్ల చేతుల మీదుగా అంగరంగవైభవంగా ప్రారంభోత్సవం జరుపుకున్నది.

30,000 చదరపు అడుగులలో కుటుంబమంతటకీ షాపింగ్ ఒకోచోట చేసుకునే విధంగా బంగారు ఆభరణాలు, డైమండ్ ఆభరణాలు, వెండి వస్తువులు, పట్టు, ఫ్యాన్సీ, హై–ఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్‌వేర్, బెడ్ షీట్స్, మెన్స్ బ్రాండెడ్, కిడ్స్ వేర్, ఎథినిక్ వేర్‌‌లతో సహా ఒక్కో విభానికి ఒక్కో అంతస్థు కేటాయిస్తూ ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని ఇస్తూ.. మార్కెట్ ధరల కన్నా తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నామని ఈ షాపింగ్ మాల్ ద్వారా మరో 300 మందికి ఉపాధి కల్పిస్తున్నామని సంస్థ అధినేత శ్రీ అల్లక సత్యనారాయణ గారు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ వేడుకను ఇంతటి ఘన విజయం చేకూర్చినందుకు కస్టమర్లకు మరియు పోలీస్ శాఖ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.