ఆ రెండూ చేయగలను.. ఒక్కసారి ఆలోచించండి ..!

రాశీ ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరసగా టాలీవుడ్ లో సుప్రీమ్, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే’ లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసింది. అయితే ఒక సినిమా సూపర్ హిట్ అయితే రెండు సినిమాలు ఫ్లాపవుతూ రాశీ కెరీర్ ని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి.

Rashi Khanna

చెప్పాలంటే రాశీ ఖన్నా మల్టీ టాలెంటెడ్. హీరోయిన్ గానే కాదు సింగర్ కూడా ప్రూవ్ చేసుకుంది. తను పాడిన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే హీరోయిన్ గా చాలా సినిమాలు చేసినప్పటికి రష్మిక మందన్న, పూజా హెగ్డేల మాదిరిగా స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో జై లవ కుశ తర్వాత రాశీ కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అందరూ భావించారు. కానీ అలా జరగకపోగా చేతిలో చెప్పుకునే సినిమా లేక డీలా పడింది.

Rashi Khanna Looks Adorable in Her Latest Traditional Photo Shoot| ఈ  ఫోటోల్లో రాశీ ఖన్నా ఎంత సంప్రదాయంగా కనిపిస్తుందో చూడండి |News in Telugu

ప్రస్తుతం రాశీ ఖన్నా తమిళ సినిమాలు అంగీకరించింది. కాని విచిత్రంగా ఒక్క తెలుగు సినిమా చేతిలో లేకపోవడం ఆశ్చర్యకరం. అందుకే తనలోని పూర్తి టాలెంట్ ఏంటో చూపించడానికి ఎప్పటికప్పుడు కొత్త తరహాలో రక రకాల ఫొటోషూట్స్ చేస్తూ ప్రేక్షకులను, ఇండస్ట్రీ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్య ఫోటోషూట్స్ తో ఓకవైపు హాట్ స్పైసీ లుక్ లో కనిపించి కవ్విస్తూనే..మరో వైపు ట్రెడిషనల్ లుక్ లో అచ్చ తెలుగమ్మాయిలా ఇంకా చెప్పాలంటే భీమవరం.. రాజమండ్రి అమ్మాయిలా గెటప్స్ వేస్తూ తను ఎలాంటి క్యారెక్టర్స్ అయినా సూటవుతాను అంటూ మేకర్స్ కి సంకేతాలు పంపుతోంది. మరి చూడాలి ఈ ఫొటో షూట్స్ రాశీఖన్నా కి ఏ మాత్రం ఉపయోగపడతాయో.